టాప్ 10లో ఆ రెండు ఫ్లాప్ సినిమాలు
ఈ లిస్ట్ లో ఉన్న వార్2, గేమ్ ఛేంజర్ సినిమాల గురించి నెటిజన్లు గూగుల్ లో ఎక్కువగా వెతికినప్పటికీ, ఆడియన్స్ ను మెప్పించడంలో మాత్రం ఈ సినిమాలు విఫలమయ్యాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Sravani Lakshmi Srungarapu | 3 Jan 2026 6:42 PM ISTఎప్పుడైనా సక్సెస్‌ఫుల్ సినిమాల గురించి అందరూ ఎక్కువగా మాట్లాడుతూ, తెలియని వాళ్లు వాటి గురించి తెలుసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సార్లు ఫ్లాపు సినిమాల గురించి కూడా తెలుసుకోవడానికి ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారని రీసెంట్ గా జరిగిన ఓ సంఘటన నిరూపిస్తుంది. తాజాగా గూగుల్ ఇండియా ఇయర్ ఇన్ సెర్చ్ 2025 లిస్ట్ వచ్చింది.
ఈ లిస్ట్ లో ఆడియన్స్ ఎవరూ ఊహించని కొన్ని సినిమాలుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 2025లో ఇండియాలో ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవలేదని ఈ లిస్ట్ చూస్తుంటే అర్థమవుతుంది. ఆ లిస్ట్ లో టాలీవుడ్ కు సంబంధించిన రెండు భారీ యాక్షన్ సినిమాలు టాప్ 10 సెర్చ్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నప్పటికీ, ఆడియన్స్ ను మాత్రం మెప్పించలేకపోయాయి. ఇంకా చెప్పాలంటే ఆడియన్స్ మనసుల్ని బాధించడం వల్లే ఆ సినిమాలు ఆ లిస్ట్ లో నిలిచాయి.
గూగుల్ ఇండియా ఇయర్ ఇన్ సెర్చ్ 2025 లిస్ట్
లిస్ట్ లో మొదటిగా సైయారా ఉండగా, తర్వాత కాంతార చాప్టర్1, కూలీ, వార్2, సనమ్ తేరి కసమ్, మార్కో, హౌస్‌ఫుల్5, గేమ్ ఛేంజర్, మిసెస్, మహావతార్ నరసింహ ఉన్నాయి. ఈ లిస్ట్ లో ఉన్న వార్2, గేమ్ ఛేంజర్ సినిమాల గురించి నెటిజన్లు గూగుల్ లో ఎక్కువగా వెతికినప్పటికీ, ఆడియన్స్ ను మెప్పించడంలో మాత్రం ఈ సినిమాలు విఫలమయ్యాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
భారీ నష్టాల్ని మిగిల్చిన గేమ్ ఛేంజర్
రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా ఈ టాప్10 లిస్ట్ లో స్థానమైతే సంపాదించుకుంది కానీ ఈ మూవీ ఆడియన్స్ ను ఎంతగానో నిరాశ పరిచింది. శంకర్, చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి కానీ శంకర్ వీక్ డైరెక్షన్ వల్ల ఈ పొలిటికల్ థ్రిల్లర్ కోసం చరణ్ పడిన కష్టం, అతని టైమ్ అన్నీ వృధా అయిపోయాయి. గేమ్ ఛేంజర్ మూవీ నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాల్నే మిగిల్చింది.
ఆడియన్స్ ను మెప్పించడంలో విఫలమైన వార్2
ఇక వార్2 విషయానికొస్తే హృతిక్ రోషన్ హీరోగా జూ. ఎన్టీఆర్ మొదటిసారి విలన్ గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు రిలీజ్ ముందే పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు భారీగా క్రేజ్ పెరిగిన నేపథ్యంలో వార్2 పై కూడా అందరికీ మంచి అంచనాలున్నాయి. కానీ ఈ సినిమా ఆడియన్స్ ను అలరించడంలో ఫెయిలైంది. వార్2 ఎక్కువగా సెర్చ్ చేయబడిన సినిమా అయినప్పటికీ ఈ మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను మాత్రం చాలా తీవ్రంగా నిరాశ పరిచింది. మొత్తానికి 2025లో రిలీజై ఫ్లాపులుగా నిలిచిన రెండు సినిమాలు ఇప్పుడు 2026లో మరోసారి హాట్ టాపిక్ గా మారడం విశేషం.
