2026-27 సీజన్ మోస్ట్ అవైటెడ్ సినిమాలు
2026-2027 సీజన్ భారతీయ సినీపరిశ్రమలో అతిపెద్ద సినిమాలతో సందడి చేయనుంది. ముఖ్యంగా పురాణేతిహాసం 'రామాయణం' ఆధారంగా 'దంగల్' ఫేం నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం -1, రామాయణం -2 ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్నాయి.
By: Tupaki Desk | 7 Jun 2025 11:30 AM IST2026-2027 సీజన్ భారతీయ సినీపరిశ్రమలో అతిపెద్ద సినిమాలతో సందడి చేయనుంది. ముఖ్యంగా పురాణేతిహాసం 'రామాయణం' ఆధారంగా 'దంగల్' ఫేం నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం -1, రామాయణం -2 ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాల రాక కోసం ప్రపంచం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తోంది. దీనికి కారణం ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్న తారాగణం.
దేశంలోని బిగ్గెస్ట్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాని స్వయంగా నిర్మిస్తూ, ఇందులో రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడు కేజీఎఫ్ యష్. దాదాపు 400కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు యష్ అన్నీ తానే అయ్యాడు. ఎంపిక చేసుకున్న కాస్టింగ్ కూడా ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే 70రోజుల పాటు రావణాసురుడి పాత్రపై చిత్రీకరణ సాగిందని కథనాలొచ్చాయి. అంటే రాముడు, లక్ష్మణుడు, సీత, రావణాసురుడి పోర్షన్లపై చాలా సన్నివేశాలు తెరకెక్కాయి. ఇటీవలే యష్‌తో పాటు ఇంద్రదేవ్ పాత్రను పోషిస్తున్న కునాల్ కపూర్ కూడా సెట్స్‌లో చేరాడని తెలిసింది. అంటే రావణ్ తో ఇంద్రదేవుని పోరాటాలను తెరకెక్కించారు. సైఫ్ తో కలిసి `జువెల్ థీఫ్` సినిమాలో కునాల్ నటనకు మంచి పేరొచ్చింది. అతడు రామాయణంకి ప్లస్ అవుతాడని అంచనా.
ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, సన్నీడియోల్ ఆంజనేయుడి పాత్రను పోషిస్తున్నారు. 2026 దీపావళికి తొలి భాగం విడుదలవుతుంది. 2027లో రెండో భాగం విడుదలవుతుంది. బుల్లితెరపై ఎన్నోసార్లు రామాయణం తెరకెక్కింది. ప్రతిసారీ ప్రజలు ఆదరించారు. పెద్ద తెరపైనా రామాయణం సినిమాలు అలరించాయి. దిగ్గజ దర్శకులు రామాయణ కథల్ని అందంగా తెరకెక్కించి ప్రజల మన్ననలు పొందారు. వాటన్నిటికీ భిన్నంగా ఇప్పుడు మారిన టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని, అవెంజర్స్, అవతార్ రేంజులో నితీష్ ఈ సినిమాని రూపొందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. నితీష్ ఫోకస్ రావణ- రాముడి పోరాటాలు, యుద్ధాలపైనా? ఏమోషన్స్ పైనా? అన్నది వేచి చూడాలి.
