Begin typing your search above and press return to search.

మంత్ ఆఫ్ మధు రిలీజ్ డేట్ ఫిక్స్

తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. అక్టోబర్ 6న మూవీ థియేటర్స్ లోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు.

By:  Tupaki Desk   |   12 Sep 2023 3:47 AM GMT
మంత్ ఆఫ్ మధు రిలీజ్ డేట్ ఫిక్స్
X

కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేద. డేంజర్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ స్వామి రారా సినిమాతో హీరోయిన్ అయ్యింది. తరువాత వరుస మూవీస్ చేస్తూ వచ్చింది. తెలుగు, తమిళ్ భాషలలో సూపర్ హిట్ సినిమాలలో భాగమైన ఈ అమ్మడు పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకి దూరంగా ఉంది. మళ్ళీ మ్యాకప్ వేసుకొని నటిగా తన ప్రస్థానం కొనసాగిస్తోంది.


ఇప్పటికే తేజ్ తో కలిసి ఒక ప్రైవేట్ సాంగ్ లో కలర్స్ స్వాతి నటించింది. ది సోల్ ఆఫ్ సత్య పేరుతో వచ్చిన ఈ కాన్సెప్ట్ సాంగ్ సోషల్ మీడియాలో భాగా సక్సెస్ అయ్యింది. నవీన్ చంద్రకి జోడీగా ఈ బ్యూటీ ముంత్ ఆఫ్ మధు అనే సినిమాలో నటించింది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. ఇప్పటికే ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది. వ్యసనాలకి బానిసైన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి జీవితాన్ని ఈ చిత్రంలో దర్శకుడు శ్రీకాంత్ నాగోతి చూపించబోతున్నాడు.

రియాలిటీకి దగ్గర మన చుట్టూ ఎంతో మంది జీవితాలలో ఉండే కథని సిల్వర్ స్క్రీన్ పై మంత్ ఆఫ్ మధు సినిమా ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేయడం నిజంగా విశేషమని చెప్పాలి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. అక్టోబర్ 6న మూవీ థియేటర్స్ లోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు. యస్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. గతంలో శ్రీకాంత్ నాగోతి, యశ్వంత్, నవీన్ చంద్ర కాంబినేషన్ భానుమతి రామకృష్ణ మూవీ వచ్చింది.

ఒటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అందులో కూడా సున్నితమైన భావోద్వేగాల్ని తెరపై అందంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఒటీటీ ఆడియన్స్ కి ఆ మూవీ విపరీతంగా నచ్చేసింది. ఇప్పుడు మంత్ ఆఫ్ మధు సినిమాలో తాగుబోతు అయిన ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి చివరికి వాడికి ఎందుకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైంది అనే ఎలిమెంట్ ని చెప్పబోతున్నారు.

అచ్చు రాజమణి ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. రవికాంత్ పేరిపు మూవీకి ఎడిటింగ్ చేశారు. ఇతను కూడా ఇప్పటికే దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నారు. జ్ఞానేశ్వరి కాండ్రేగుల మరో ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపిస్తోంది. అలాగే మహేష్ బాబు అక్క మంజుల కూడా ఓ పాత్రలో నటించింది. మరి ఫ్యామిలీ ఎమోషన్స్ తో రాబోతున్న ఈ మూవీ మేరకు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందనేది చూడాలి.