Begin typing your search above and press return to search.

మంకీ మ్యాన్ సినిమా ఇండియాలో కష్టమేనా...!

స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ నటుడు దేవ్ పటేల్ ముఖ్య పాత్రలో రూపొందిన హాలీవుడ్‌ మూవీ మంకీ మ్యాన్‌ ఏప్రిల్‌ 5న యూఎస్ లో విడుదల అవ్వబోతుంది.

By:  Tupaki Desk   |   1 April 2024 10:42 AM GMT
మంకీ మ్యాన్ సినిమా ఇండియాలో కష్టమేనా...!
X

స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ నటుడు దేవ్ పటేల్ ముఖ్య పాత్రలో రూపొందిన హాలీవుడ్‌ మూవీ మంకీ మ్యాన్‌ ఏప్రిల్‌ 5న యూఎస్ లో విడుదల అవ్వబోతుంది. ఇండియాతో పాటు పలు దేశాల్లో ఏప్రిల్‌ 19న విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు.

మంకీ మ్యాన్ సినిమా విడుదల అవ్వకుండానే విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ మధ్య ఒక అంతర్జాతీయ సినీ వేదిక పై ఈ సినిమా స్క్రీనింగ్‌ చేశారు. విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇంతటి అద్భుతమైన సినిమాకు వచ్చే ఏడాది అకాడమీ అవార్డుల పంట ఖాయం అంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి.

ఇప్పటి వరకు స్క్రీనింగ్‌ అయిన అన్ని చోట్ల కూడా స్టాండింగ్ ఓవేషన్ ను దక్కించుకున్న ఈ సినిమా ఇండియాలో ఏప్రిల్‌ 19న విడుదల అయ్యేనా లేదా అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. మేకర్స్ ఏప్రిల్‌ 19న విడుదల చేస్తామని ప్రకటించగా, ఇక్కడి సెన్సార్ నిబంధనలు సినిమా విడుదల అయ్యేందుకు అడ్డు పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో హీరో తన తల్లి హత్యకు కారణమైన వారిపై పగ తీర్చుకునేందుకు హనుమంతుడి గెటప్‌ వేసుకుంటాడు. ఆ క్రమంలో అతను చేసిన పనులు ఏంటి, అసలు అతడి తల్లి మరణానికి కారణం ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అనే పాయింట్స్ తో సినిమా ను రూపొందించడం జరిగింది.

మతాల విశ్వాసాలను దెబ్బ తీసే విధంగా మంకీ మ్యాన్ లోని కొన్ని సన్నివేశాలు ఉన్నాయి అనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఇండియన్‌ సెన్సార్‌ బోర్డ్‌ నుంచి క్లియరెన్స్ రావడం కష్టం అవ్వచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఒక వేళ ఏప్రిల్‌ 19 వరకు సెన్సార్‌ క్లియరెన్స్ రాకుంటే మాత్రం ఏప్రిల్‌ 26కి వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి. సెన్సార్‌ కి ఇబ్బంది అయిన సన్నివేశాల విషయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మంకీ మ్యాన్‌ ఇండియాలో రిలీజ్ అవ్వడం ఖాయం అని మేకర్స్ ప్రకటించారు.