కళ్లు చెదిరే మేకోవర్.. వైరల్ గర్ల్ మోనాలిసాను గుర్తుపట్టలేరు!
మహా కుంభమేళా ఈ ఏడాది జనవరిలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచ దేశాల నుంచి 60కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
By: Tupaki Desk | 25 April 2025 8:14 PM ISTమహా కుంభమేళా ఈ ఏడాది జనవరిలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచ దేశాల నుంచి 60కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కొన్ని వందల కోట్ల వ్యాపారం ఈ సమయంలో జరిగింది. వేలాది మంది తమ జీవనోపాధి కోసం ఇక్కడకు వచ్చి పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో పూసలు అమ్ముకునేందుకు వచ్చి సెలబ్రిటీగా మారిన మోనాలిసా ఒకరు. ఈ తేనెకళ్ల సుందరి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సోషల్ మీడియా, మీడియా, పత్రికలు ఎక్కడ చూసినా తనే కనిపించింది. దీంతో ఆమెకు ఏకంగా సినిమా ఆఫర్ ఇస్తున్నట్లు ఓ డైరెక్టర్ కూడా ప్రకటించాడు.
ఈ క్రమంలోనే ఆమె నటనలోనూ, బ్యూటీలోనూ మెలకువలు నేర్చుకుంటుంది. ఈ క్రమంలోనే మోనాలిసాను గుర్తుపట్టలేనంతగా ఆమె రూపాన్ని మార్చేశారు మేకప్ ఆర్టిస్ట్. పెద్ద కళ్లతో, ప్రత్యేకమైన అందంతో ఆకట్టుకునే మోనాలిసా ఈ కొత్త లుక్‌లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. లైక్‌లు, కామెంట్లతో ఆమె పోస్ట్ నిండిపోయింది. "ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదు", "నిజంగా అద్భుతం" అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మోనాలిసా కేవలం తన అందంతోనే కాదు, నటనతోనూ మెప్పిస్తోంది. ఆమె చేస్తున్న రీల్స్‌లో నటన కూడా క్రమంగా మెరుగుపడుతోంది. "చూస్తుండగానే ఇంత బాగా నటించడం నేర్చుకుందా" అని కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మరికొందరు ఆమె ఇంకాస్త మెరుగుపడాలని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. వైరల్ గర్ల్ మోనాలిసా ప్రధానంగా షార్ట్ వీడియోలు, రీల్స్‌లో కనిపిస్తున్నారు. ఆమె నటిస్తున్న సినిమాల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. అయితే, సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్‌ను చూస్తుంటే భవిష్యత్తులో ఆమె సినిమాల్లో కూడా కనిపించే అవకాశం ఉంది.
