మాలీవుడ్ మళ్లీ పడిపోతుందా?
ఆ మధ్య వరుస విజయాలతో మాలీవుడ్ పాన్ ఇండియాలో ఏ రేంజ్ లో వెలిగిపోయిందో తెలిసిందే. చిన్న చిత్రాలైనా బాక్సాఫీస్ వద్ద పెద్ద వియాలు నమోదు చేసాయి.
By: Tupaki Desk | 28 April 2025 5:00 PM ISTఆ మధ్య వరుస విజయాలతో మాలీవుడ్ పాన్ ఇండియాలో ఏ రేంజ్ లో వెలిగిపోయిందో తెలిసిందే. చిన్న చిత్రాలైనా బాక్సాఫీస్ వద్ద పెద్ద వియాలు నమోదు చేసాయి. వందల కోట్ల వసూళ్లతో సౌత్ లో సెంట్రాఫ్ ది అట్రాక్షన్ గా నిలిచాయి. `మార్కో` లాంటి సినిమా ఏకంగా మాలీవుడ్ కి న్యూట్రెండ్ ని పరిచయం చేసింది. సక్సస్ తో పాటు అక్కడ కంటెంట్ ని ఇతర భాషల్లో రీమేక్ చేయడం కూడా ఊపందుకుంది. ఇలా విజయాలతో ...వసూళ్లతో కళకళలాడిన పరిశ్రమ ఇప్పుడు వెల వెల బోతుందని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
నివేదికల ప్రకారం ఫిబ్రవరిలో విడుదలైన 17 మలయాళ చిత్రాలలో ఒకే ఒక్క చిత్రం ` ఆఫీసర్ ఆన్ డ్యూటీ` మాత్రమే విజయం సాధించింది. మిగిలిన 16 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ 17 చిత్రాల మొత్తం బడ్జెట్ సుమారు 73 కోట్లు. అయితే వాటి థియేట్రికల్ రిటర్న్ లు కేవలం 23.5 కోట్లు మాత్రమే. ఈ వసూళ్లు చూసి మాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. నిర్మాణ సంస్థల్లో గుబులు అప్పుడే మొదలైంది.
తాజాగా మార్చి రిపోర్ట్ కూడా విడుదల చేసింది మాలీవుడ్ నిర్మాతల మండలి. మార్చిలో మొత్తం 15 చిత్రాలు రిలీజ్ అవ్వగా అందులో `ఎల్2 ఎంపురాన్` మినహా ఏ చిత్రం విజయం సాధించలేదు. 15 రిలీజ్ ల్లో ఒకే ఒక్క హిట్ గా ఎంపురాన్ నిలిచింది. ఎంపురాన్ మినహా మిగతా సినిమా బడ్జెట్ మొత్తం కలిపితే 195 కోట్లు. వచ్చింది 25 కోట్లు మాత్రమే షేర్ మాత్రమే. `వడక్కన్`, `పరివార్ సైకిల్` లాంటి సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవడంలో విఫలమయ్యాయి.
ఇలా ఫిబ్రవరి, మార్చిలో రిలీజ్ అయిన మాలీవుడ్ చిత్రాల ఫలితాలతో పరిశ్రమలో ఆందోళన ముదురుతోంది. కొన్ని సినిమాలకు సరైన ప్రచారం లేక, మరికొన్ని చిత్రాలకు రిలీజ్ సవ్యంగా లేకపో వడంతో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయి ఉండొచ్చని నిర్మాతల మండలి అంచనా వేస్తోంది. అప్ కమింట్ రిలీజ్ విషయంలో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని నిర్మాతలను హెచ్చరించింది మండలి.
