Begin typing your search above and press return to search.

మాలీవుడ్ 2025 రిపోర్ట్ కార్ట్.. అతనే విన్నర్

చిన్న బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించి, భారీ విజయాలు సాధించడం మలయాళ ఇండస్ట్రీకి వెన్నతో పెట్టిన విద్య.

By:  Tupaki Desk   |   13 July 2025 9:21 AM IST
మాలీవుడ్ 2025 రిపోర్ట్ కార్ట్.. అతనే విన్నర్
X

చిన్న బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించి, భారీ విజయాలు సాధించడం మలయాళ ఇండస్ట్రీకి వెన్నతో పెట్టిన విద్య. ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ అలాంటివే. అయితే ఈ ఏడాది కూడా భారీ అంచనాలతో మాలీవుడ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలు సందడి చేశాయి. అలా తొలి ఆరు నెలల్లో కొన్ని సినిమాలు అందరి అంచనాలు తలకిందులు చేసి అభిమానులను అలరించి మంచి విజయం దక్కించుకున్నాయి.

మాలీవుడ్ స్టార్‌ హీరో మోహన్‌ లాల్‌ ఈ ఏడాది ఆరు నెలల్లోనే డబుల్‌ హిట్‌ అందుకున్నారు. హీరో పృథ్వీ రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఎంపురాన్‌ మంచి విజయం దక్కించుకుంది. ఆ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 265 కోట్ల కలెక్షన్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఈ సినిమాతో మోహన్ లాల్ తొలి హిట్ అందుకున్నారు.

ఇక ఆయన లీడ్ రోల్ లో నటించిన ‘తుడరుం సినిమా సైతం సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షఁ కురిపించింది. రూ. 230 కోట్లు వసూల్ చేసింది. మరోవైపు, మలయాళ మెగాస్టార్‌ మమ్మూట్టి అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యారు. ఆయన కీలక పాత్రలో తెరకెక్కిన డొమినిక్‌, లేడీస్‌ పర్స్‌ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

అదే సమయంలో చిన్న సినిమాలకు మంచి ఆదరణ దక్కింది. డిఫరెంట్ స్టోరీలు, వైవిధ్య భరిత చిత్రాలతో మూవీ లవర్స్ ను మాలీవుడ్ మరోసారి ఆకట్టుకుంది. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన అసిఫ్‌ అలీ- అనస్వర రాజన్‌ జంటగా నటించిన రేఖా చిత్రం సినిమా మంచి విజయం దక్కించుకుంది. కుంచక్కో బోబన్‌ కీ రోల్ లో తెరకెక్కిన ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ, టోవినో థామస్‌ నరివెట్ట లాంటి థ్రిల్లర్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకున్నాయి.

ఇక ఎన్నో అంచనాలతో వచ్చిన ఐడెంటిటీ సినిమా ప్రేక్షకులను ఆకట్టులేకపోయింది. టోవినో థామస్- త్రిష లాంటి స్టార్ నటులు ఉన్నా స్టోరీలో బలం లేక డీలా పడింది. అలాగే కమ్యూనిస్టుపచ్చ అదవా అప్పా, ఐడి: ది ఫేక్‌ సినిమాలు కూడా బాక్సాఫీస్‌ విఫలమయ్యాయి. అలా 2025 ఫస్ట్ హాఫ్ లో మలయాళ ఇండస్ట్రీ విజయాలు, అపజయాలు అందుకుంది. మోహన్‌ లాల్‌ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో మలయాళ పరిశ్రమకు భారీ విజయాలు దక్కాయి. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి!