Begin typing your search above and press return to search.

మోక్ష‌జ్ఞ అరంగేట్రం కోస‌మే అలా చేశాడా?

ఎంత‌గా చ‌ర్చ జ‌రుగుతున్నా వార‌సుడి ఎంట్రీకి సంబంధించిన అప్ డేట్ ని మాత్రం బాల‌య్య ఇప్ప‌టికీ ఇవ్వ‌లేక‌పోతున్నాడు

By:  Tupaki Desk   |   13 Oct 2023 10:11 AM GMT
మోక్ష‌జ్ఞ అరంగేట్రం కోస‌మే అలా చేశాడా?
X

టాలీవుడ్‌లో వార‌సుల హ‌వా కొన‌సాగుతోంది. ఆచ‌లా మంది హీరోల‌కు సంబంధించిన వార‌సులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చేసి స్టార్ డ‌మ్‌ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా స్టార్‌లుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. కానీ ఒక్క నంద‌మూరి బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ మాత్రం ఇప్ప‌టికీ ఎంట్రీ ఇవ్వ‌కుండా ప్ర‌తీ ఏడాది వాయిదా వేస్తూ వ‌స్తున్నాడు. దీంతో బాల‌య్చ వార‌సుడి ఎంట్రీ ఎప్పుడు అనే చ‌ర్చ స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

ఎంత‌గా చ‌ర్చ జ‌రుగుతున్నా వార‌సుడి ఎంట్రీకి సంబంధించిన అప్ డేట్ ని మాత్రం బాల‌య్య ఇప్ప‌టికీ ఇవ్వ‌లేక‌పోతున్నాడు. రెండు మూడేళ్ల క్రితం 'ఆదిత్య 999'తో మోక్ష‌జ్ఞ హీరోగా ప‌రిచ‌యం అవుతాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది కానీ కుద‌ర‌లేదు. బాల‌య్య డైరెక్ట‌ర్‌గా ఈ సినిమాతో వార‌సుడిని ప‌రిచ‌యం చేస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి కానీ అదీ జ‌ర‌గ‌లేదు. వ‌చ్చే ఏడాదైనా అరంగేట్రం ఉంటుందా? అని స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతున్న వేళ నంద‌మూరి మోక్ష‌జ్ఞ యాక్టీవ్ అయ్యాడు.

బాల‌య్య న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'భ‌గ‌వంత్ కేస‌రి'. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. శ్రీ‌లీల కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈమూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాల‌తో అంచ‌నాల్ని పెంచేసిన 'భ‌గ‌వంత్ కేస‌రి' అక్టోబ‌ర్ 19న ద‌స‌రా సంద‌ర్భంగా భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. సినిమా రిలీజ్ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటున్న హ‌రీష్ గార‌పాటి ఓ మీడియాకు ప్ర‌త్యేకంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నంద‌మూరి మోక్ష‌జ్ఞ‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

సినిమాలో మోక్ష‌జ్ఞ‌తో పాటు బాల‌య్య త‌న చిన్న కుమార్తె తేజ‌స్విని ప్ర‌మోయంపై స్పందించారు. బాల‌కృష్ణ‌గారిని ఈ చిత్రంలో విభిన్న‌కోణాల్లో చూపించామ‌న్నారు. అంతే కాకుండా సినిమాలో కొత్త త‌ర‌హా యాక్ష‌న్ స‌న్నివేశాలుంటాయ‌న్నారు. సాధ్య‌మైన‌ప్పుడ‌ల్లా సెట్‌లోకి బాల‌కృష్ణ‌గారితో పాటు మోక్ష‌జ్ఞ సెట్లోకి వ‌చ్చార‌న్నారు. వ‌చ్చే ఏడాది మోక్ష‌జ్ఞ‌ని హీరోగా ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. ఆ కార‌ణంగానే ఆయ‌న సినిమా నిర్మాణంని అర్థం చేసుకోవ‌డం కోస‌మే సెట్ లోకి అడుగు పెట్టార‌ని స్ప‌ష్టం చేశారు. సాహు గార‌పాటి చెప్పిన దాన్ని బ‌ట్టి చూస్తుంటే మోక్ష‌జ్ఞ వ‌చ్చే ఏడాది సినిమాల్లోకి రంగ ప్ర‌వేశం చేస్తున్నార‌న్న‌మాట‌. ముందుగా సినిమా నిర్మాణం, సెట్‌లో ఉండే వాతావ‌ర‌ణాన్ని అవ‌గాహ‌న చేసుకోవ‌డం కోస‌మే 'భ‌గ‌వంత్ కేస‌రి' సెట్‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా వ‌చ్చార‌ని తెలుస్తోంది. ఎంత ముందు జాగ్ర‌త్త‌. ఎంతైనా బాల‌య్య త‌న‌యుడు క‌దా.. ఆ మాత్రం జాగ్ర‌త్త ఉంటుంది అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.