Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞతో ఆ సీక్వెలా - ఇంకెప్పుడో?

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Tupaki Desk   |   9 Jan 2024 6:06 AM GMT
మోక్షజ్ఞతో ఆ సీక్వెలా  - ఇంకెప్పుడో?
X

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ తెరంగ్రేటం పై గత ఐదేళ్ళ నుంచి ఫ్యాన్స్ ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. అసలు మోక్షజ్ఞ ఎంట్రీ పై మౌనంగా ఉన్నా ఫ్యాన్స్ పెద్దగా రియాక్ట్ అయ్యేవారు కాదేమో.. కానీ బాలయ్య అదిగో వస్తున్నాం.. ఇదిగో కాన్సెప్ట్ రెడీ అంటూ చాలా కాలంగా ఉరిస్తూనే ఉన్నారు.

అప్పుడెప్పుడో ఆదిత్య 369 సీక్వెల్ 999 అంటూ చెప్పిన బాలయ్య దర్శకత్వం తనదే అన్నట్లు చెప్పారు. అనంతరం దర్శకుల లిస్టు మారితూ వచ్చింది. ఇక ఈ లోపు మోక్షజ్ఞ కు సంబంధించిన ఫొటోలు కొన్ని వైరల్ అయ్యాయి. ఏదేమైనా మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం పక్కా అన్నట్లే బాలయ్య చెబుతూ వచ్చారు.

ఇక రీసెంట్ గా మరోసారి వారసుడి ఎంట్రీ పై ఇండస్ట్రీలో బజ్ మొదలైంది. ఈసారి అఖండ 2 లిస్టులోకి వచ్చింది. బోయపాటి దర్శకత్వంలో రాబోయే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆంద్రప్రదేశ్ ఎన్నికల అనంతరం మొదలయ్యే అవకాశం ఉందట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న బోయపాటి మోక్షజ్ఞ ఎంట్రీని దృష్టిలో ఉంచుకొని స్క్రిప్ట్ ను డిజైన్ చేస్తున్నట్లు టాక్.

బోయపాటి మొదట మోక్షజ్ఞను సోలోగానే తన స్టైల్ మాస్ కథతో పరిచయం చేయాలని అనుకున్నారు. అందుకోసం పలు రకాల కథలపై చాలాసార్లు చర్చించారు. కానీ బాలయ్యకి కాన్ఫిడెంట్ గా ఏ కథను నమ్మలేకపోయారు. కొడుకు ఎంట్రీ విషయంలో రిస్క్ తీసుకోకుండా ఉండాలని అనుకున్నారు. లేటైనా బలమైన కథతో రావాలని అనుకున్నారు.

ఇక బోయపాటి అఖండ 2 అయితే బెస్ట్ అని డిసైడ్ అయ్యారు. అందుకు బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో సిద్ధమైన తరువాత మరోసారి బాలక్రిష్ణ చర్చించే అవకాశం ఉంది. అంతా ఒకే అయితే షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక మరోవైపు బాలయ్య బాబు బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక బోయపాటి సూర్యతో కూడా ఒక సినిమా చేసేందుకు ఆ మధ్య గట్టిగానే ప్రయత్నం చేశారు. కానీ ఆ హీరో బిజీగా ఉండడం వలన మళ్ళీ బాలయ్య వైపు యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.