Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: నంద‌మూరి న‌ట‌వార‌సుడు మోక్ష‌జ్ఞ ప‌రేషాన్

అయితే మోక్ష‌జ్ఞ సినీఎంట్రీపై న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ స్వ‌యంగా క్లారిటీనివ్వ‌డంతో ఆ త‌ర్వాత గుస‌గుస‌లు స‌ద్ధుమ‌ణిగాయి.

By:  Tupaki Desk   |   29 Aug 2023 4:01 AM GMT
ఫోటో స్టోరి: నంద‌మూరి న‌ట‌వార‌సుడు మోక్ష‌జ్ఞ ప‌రేషాన్
X

న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌముడు, అన్న‌గారు ఎన్టీఆర్‌పై భారత ప్రభుత్వం నాణేన్ని విడుదల చేయడం నందమూరి కుటుంబం మొత్తానికి గర్వకారణం. ఢిల్లీలో జరిగిన భారీ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి నందమూరి వంశం మొత్తం హాజరైంది.


మరోవైపు నందమూరి మోక్షజ్ఞ ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్న ఫోటోలు వైరల్‌గా మారడంతో అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌ కొడుకు ఈ ఫోటోగ్రాఫ్స్ లో ఎంతో ఇస్మార్ట్ గా కనిపిస్తున్నాడు. అత‌డి అంద‌మైన క‌ళ్లు.. తీర్చిదిద్దిన‌ట్టు ఉండే ముక్కు ముఖాకృతి ఆక‌ట్టుకున్నాయి. చూస్తుంటే అత‌డు చాక్లెట్ బోయ్ గా మ‌గువ‌ల మ‌న‌సులు దోచేయ‌డం ఖాయ‌మ‌ని నంద‌మూరి అభిమానులు ఊహిస్తున్నారు. టాలీవుడ్ లో డైన‌మిక్ హీరోగా అత‌డు సూప‌ర్బ్ ఎంట్రీ ఇస్తాడా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్. నాలుగైదేళ్లుగా మోక్ష‌జ్ఞ అరంగేట్రం గురించి చ‌ర్చ సాగుతూనే ఉంది. కానీ అది ఇప్ప‌టివ‌ర‌కూ సాధ్య‌ప‌డ‌లేదు.

స‌స్పెన్స్ కి తెర దించేదెపుడు? న‌ట‌వార‌సుల సినీ ఆరంగేట్రం అన్నివేళ‌లా ఉత్కంఠ‌ను క‌లిగించే టాపిక్. అభిమానుల్లో సామాన్య ప్ర‌జ‌ల్లో దీనిపై ఎక్కువ చ‌ర్చ సాగుతుంటుంది. మీడియా డిబేట్ ఆస‌క్తిని పెంచుతాయి. బాలీవుడ్ - టాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోను ఈ స‌న్నివేశం క‌నిపిస్తోంది. నంద‌మూరి మోక్ష‌జ్ఞ సినీఎంట్రీ గురించి కొన్నాళ్లుగా ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ మొద‌లైంది. కానీ ఈ నాలుగైదేళ్ల‌లో మోక్షు ప్రిప‌రేష‌న్ ఆ దిశ‌గా సాగిన‌ట్టు క‌నిపించ‌లేదు.

దీనిపై నంద‌మూరి అభిమానులు స‌హా కామ‌న్ జ‌నాల్లో బోలెడంత చ‌ర్చా సాగింది. బాల‌య్య వార‌సుడు మోక్ష‌జ్ఞ న‌ట‌న‌పై ఆస‌క్తిగా లేడ‌ని కూడా గుస‌గుస స్ప్రెడ్ అయ్యింది. అయితే మోక్ష‌జ్ఞ సినీఎంట్రీపై న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ స్వ‌యంగా క్లారిటీనివ్వ‌డంతో ఆ త‌ర్వాత గుస‌గుస‌లు స‌ద్ధుమ‌ణిగాయి. మోక్ష‌జ్ఞ వ‌స్తాడు.. అయితే కాస్త ఆల‌స్య‌మ‌వుతుంద‌ని అర్థ‌మైంది.

తాజా స‌న్నివేశం చూస్తుంటే .. మోక్షజ్ఞ సినీఎంట్రీకి ఇంకా ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌దని అర్థ‌మ‌వుతోంది. 2024లో అత‌డి సినీఆరంగేట్రం ఉంటుంది. ప్ర‌స్తుతం అత‌డు త‌న శ‌రీరాకృతిని తీర్చిదిద్దుకునే ప‌నిలో ఉన్నాడు. అందుకు జిమ్ లో క‌స‌ర‌త్తులు చేస్తున్నాడ‌ని తాజాగా రిలీజైన ఫోటోలు చెబుతున్నాయి. ఇక న‌ట‌సింహా లెగ‌సీని ముందుకు తీసుకెళ్లే నందమూరి వార‌సుడిగా అత‌డిని అభిమానులు ప్ర‌జ‌లు చూస్తున్నారు.

మోక్షు డెబ్యూ చిత్రానికి త‌న తండ్రి గారైన బాల‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించేందుకు ఛాన్స్ లేక‌పోలేద‌ని కూడా టాక్ వినిపిస్తోంది. ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ ని బాల‌య్య బాబు ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించారు. లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు తెర‌కెక్కించిన ఆదిత్య 369 కి ఇది సీక్వెల్ క‌థాంశంతో ఈ డెబ్యూ సినిమా తెర‌కెక్కుతుంద‌ని కూడా పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే మోక్ష‌జ్ఞ సినీఎంట్రీ ఉంటుంద‌ని అంతా భావిస్తున్న త‌రుణంలో వాస్త‌వం ఏమిట‌న్న‌ది నంద‌మూరి కాంపౌండ్ వెల్ల‌డించాల్సి ఉంటుంది.