Begin typing your search above and press return to search.

గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని మొక్షజ్ఞ అన్నాడని చెప్పారు బాలకృష్ణ!

ఈ అమ్మాయితో తాను జత కట్టాలని ఉందని తన ఇంట్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని తన కొడుకు మొక్షజ్ఞ అన్నాడని చెప్పారు బాలకృష్ణ.

By:  Tupaki Desk   |   9 Oct 2023 4:02 AM GMT
గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని మొక్షజ్ఞ అన్నాడని చెప్పారు బాలకృష్ణ!
X

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ హీరోయిన్ గా నటించగా శ్రీ లీల ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఆదివారం వరంగల్ లో జరిగింది. చిత్ర యూనిట్ అంతా కలిసి అటెండ్ అయిన ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నందమూరి అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.

ఈవెంట్ లో భాగంగా బాలకృష్ణ తన ఎనర్జిటిక్ స్పీచ్ తో ఫ్యాన్స్ ని అలరించారు. ఈ సినిమా కోసం తెలంగాణ మాండలికలో సంభాషణలు చెప్పా.. ఎప్పుడూ కొత్తదనాన్ని అందించాలనే తాపత్రయం ఉంటుంది అది నాన్న దగ్గర నుంచి వంశపారపర్యంగా వస్తుందని అన్నారు బాలయ్య. అఖండ తర్వాత ఏం చేస్తాడు అనుకున్న వారికి వీర సింహా రెడ్డితో మరో రికార్డ్ సినిమా అందించాం. ఆ తర్వాత మళ్లీ ఏం చేద్దాం అనుకున్న టైం లో సరైన సినిమా భగవంత్ కేసరి దొరికిందని అన్నారు.

అనిల్ రావిపుడి దర్శకత్వంలో ఈ సినిమా చేయడం తనకు నచ్చిందని.. ఇందులో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయి.. అన్నీ దాచి పెట్టాం.. దసరాకి ముందు డబుల్ ధామాకా ఇవ్వబోతున్నామని అన్నారు బాలకృష్ణ. ఎంత సీరియస్ కథలను చెప్పినా నా స్టైల్ లో కామెడీ కూడా చేస్తాను. ఈ సినిమాలో అది సరిగా కుదిరాయని అన్నారు బాలయ్య బాబు. అందం, ప్రతిభ కలిగిన కాజల్ తో నటించాలని కొన్నాళ్లుగా ఎదురుచూశాను ఆ అవకాశం ఈ సినిమాతో వచ్చింది. శ్రీ లీల గర్వించదగిన నటి అవుతుంది. చాలా సినిమాలు చేస్తున్నా ఈ సినిమాలో తన పాత్ర ప్రత్యేకమైందని అన్నారు బాలకృష్ణ. ఈ అమ్మాయితో తాను జత కట్టాలని ఉందని తన ఇంట్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని తన కొడుకు మొక్షజ్ఞ అన్నాడని చెప్పారు బాలకృష్ణ.

రాజు తన వెనకున్న వందలమందిని చూస్తాడు.. కానీ మొరటోడు వాడికున్న ఒకే ఒక గుండెను చూసాడు అనే డైలాగ్ చెప్పి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపిన బాలకృష్ణ భగవంత్ కేసరి లో సెంటిమెంట్, డైలాగ్స్, పాటలు, ఫైట్లు అన్నీ ఉంటాయని అన్నారు. సినిమా తప్పకుండా ఫ్యాన్స్ అందరికీ నచ్చుతుందని దసరాకి భగవంత్ కేసరి అలరిస్తాడని అన్నారు బాలకృష్ణ.