Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ - తారక్ హగ్.. కిక్కిచ్చే పిక్

జూనియర్ ఎన్టీఆర్ మోక్షజ్ఞ ఇద్దరు కూడా ఆప్యాయంగా హగ్ చేసుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో ఫాన్స్ కు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది.

By:  Tupaki Desk   |   24 Aug 2023 9:29 AM GMT
మోక్షజ్ఞ - తారక్ హగ్.. కిక్కిచ్చే పిక్
X

నందమూరి అభిమానులు చాలాకాలంగా జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణను ఒకేసారి వెండి తెరపై చూడాలని ఎంతో ఆత్రుతగా అయితే ఎదురుచూస్తున్నారు. కనీసం బాహ్య ప్రపంచంలో అయినా సరే వారిద్దరూ కనిపిస్తే చూడాలని కూడా కోరుకుంటున్నారు. అయితే వీరి మధ్యలో కొంత విభేదాలు ఉన్నాయి అన్నట్లుగా చాలా కాలంగా కథనాలు అయితే వెలువడుతున్నాయి. ఇక ఆ విషయంలో ఎప్పుడూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే పెద్దగా స్పందించలేదు.

అలాగే బాలకృష్ణ కూడా ఆ విధంగా అయితే కనిపించలేదు. ఇక నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతేజ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో కనిపిస్తే చూడాలి అని ఫ్యాన్స్ చాలా కాలంగా అయితే ఎదురుచూస్తున్నారు. గతంలో చాలాసార్లు వారు ఎదురుపడినప్పటికీ ఫోటోలు మాత్రం బయటకు రాలేదు. అయితే ఇటీవల నందమూరి కుటుంబంలో జరిగిన ఒక పెళ్లి వేడుక ఫ్యాన్స్ కు మాత్రం మంచి ఆనందాన్ని అయితే ఇచ్చింది.

నందమూరి సోదరులందరూ కూడా ఒకే దగ్గర చేరి మాట్లాడుతున్న ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అంతేకాకుండా ఆ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు మోక్షజ్ఞకు ఏదో చెబుతున్నట్లుగా కూడా ఉంది. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ మోక్షజ్ఞ ముగ్గురు కలిసి దిగిన ఒక ఫోటో కూడా ఫ్యాన్స్ కు మంచి కిక్ అయితే ఇచ్చింది.

అయితే ఈసారి అంతకుమించి అనేలా మరొక ఫోటో కూడా మరింత ఎక్కువ స్థాయిలో ఆకట్టుకుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ మోక్షజ్ఞ ఇద్దరు కూడా ఆప్యాయంగా హగ్ చేసుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో ఫాన్స్ కు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. దీని కోసమే కదా ఇన్ని రోజులు కోరుకుంది అంటూ ఫ్యాన్స్ ఎంతో రియాక్ట్ అవుతున్నారు.

తప్పకుండా మోక్షజ్ఞ ఎంట్రీ సమయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సపోర్టు ఉంటుంది అనే విధంగా ఇప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇక ఇద్దరు వెండితెరపై కనిపిస్తే కిక్ మామూలుగా ఉండదు అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం బాలకృష్ణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. అయితే చాలా కాలంగానే ఈ తరహా కామెంట్స్ అయితే వినిపించాయి. కానీ ఒక ఎనౌన్స్ మెంట్ కూడా రాలేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బిగ్ స్క్రీన్ పై కుమారుడుని తీసుకురావాలి అనే బాలయ్య తాపత్రయపడుతున్నారు. మరి ఆ ప్లాన్స్ ఎప్పుడు మొదలవుతాయో చూడాలి.