Begin typing your search above and press return to search.

నంద‌మూరి న‌ట‌వార‌సుడు న‌యా లుక్

నాలుగేళ్లుగా ఇదిగో వ‌చ్చేస్తున్నాడు.. అదిగో వ‌చ్చేస్తున్నాడు..! అంటూ కాల‌యాప‌న చేస్తూనే ఉన్నారు. కానీ మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఇప్ప‌టికీ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ నే త‌ల‌పిస్తోంది.

By:  Tupaki Desk   |   18 Feb 2024 9:18 AM GMT
నంద‌మూరి న‌ట‌వార‌సుడు న‌యా లుక్
X

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా ఇప్ప‌టికీ టాలీవుడ్ ని ఏల్తున్నారు. ఆయితే ఆయ‌న న‌ట‌వార‌సుడు మోక్ష‌జ్ఞ ఎప్పుడు బ‌రిలోకి వ‌స్తాడు? అన్న‌దే స‌స్పెన్స్ గా మారింది. దీంతో నంద‌మూరి అభిమానులు తీవ్ర నిరాశ‌తో ఉన్నారు. 'ఆదిత్య 999 మ్యాక్స్' అనే చిత్రంతో మోక్ష‌జ్ఞ తెరంగేట్రం చేస్తాడ‌ని ప్ర‌క‌టించి ఇప్ప‌టికే రెండేళ్లు అవుతోంది. నాలుగేళ్లుగా ఇదిగో వ‌చ్చేస్తున్నాడు.. అదిగో వ‌చ్చేస్తున్నాడు..! అంటూ కాల‌యాప‌న చేస్తూనే ఉన్నారు. కానీ మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఇప్ప‌టికీ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ నే త‌ల‌పిస్తోంది.

అయితే ఉన్న‌ట్టుండి అత‌డు స్లిమ్ లుక్ లోకి మారి కొన్నాళ్ల క్రితం ఫ్రెష్ గా క‌నిపించే స‌రికి అస‌లైన ప్రిప‌రేష‌న్ మొద‌లైంద‌ని నంద‌మూరి అభిమానులు సంబ‌ర‌ప‌డిపోయారు. కానీ ఇంకా అత‌డి మొద‌టి సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. అయితే మోక్ష‌జ్ఞ న‌ట‌న‌, డ్యాన్సులు, ఫైట్స్ లో ఇంకా తర్ఫీదు పొందుతున్నాడ‌ని గుస‌గుస ఉంది.

తాజాగా అత‌డి కొత్త లుక్ మ‌రింత షార్ప్ గా క్రిస్పీగా క‌నిపించ‌డంతో ఇప్పుడు ఇక స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అంతా భావిస్తున్నారు. మోక్ష‌జ్ఞ కొత్త లుక్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. ఇది బాల‌య్య సినిమా సెట్స్ కి వచ్చిన‌ప్ప‌టి ఫోటోనా? లేక ఏదైనా ఫంక్ష‌న్ నుంచి క్రాప్ చేసిన ఫోటోనా? అన్న‌ది అర్థం కావ‌డం లేదు. మోక్ష‌జ్ఞ ట్రిమ్ గా క‌నిపిస్తున్నాడు. మునుప‌టిలా బొద్దుగా క‌నిపించ‌లేదు. అత‌డు గుబురు గ‌డ్డం పెంచాడు. అందువ‌ల్ల ఇంత‌కుముందు వినిపించిన కామెంట్లు ఇక వినిపించేందుకు ఆస్కారం లేదు.

ఇంత‌కీ మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమాని తెర‌కెక్కించేది ఎవ‌రు? అంటే.. బాల‌కృష్ణ తానే స్వ‌యంగా ఆదిత్య 999 మ్యాక్స్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాన‌ని కూడా అన్నారు. ఒక‌వేళ అది కుద‌ర‌క‌పోతే బోయ‌పాటి శ్రీ‌ను, అనీల్ రావిపూడి లాంటి ద‌ర్శ‌కుల‌కు బాల‌య్య త‌న‌యుడిని అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌న్న టాక్ ఉంది. అయితే ఏం జ‌రుగుతుందో కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంది.