Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ.. ఆ ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?

దసరా సందర్భంగా మోక్షజ్ఞ ఎంట్రీపైన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఉంటుందని సినీ వర్గాలలో కూడా చర్చ నడుస్తోంది.

By:  Tupaki Desk   |   14 Oct 2023 4:14 AM GMT
మోక్షజ్ఞ.. ఆ ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?
X

నందమూరి నట సింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతోన్న సంగతి తెలిసిందే. దానికోసం ఇప్పటికే అన్ని రకాల శిక్షణ తీసుకున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ 2024లో ఉండబోతోందని బాలయ్య కూడా ఇప్పటికే ప్రకటించారు. గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇద్దరు, ముగ్గురు దర్శకులని పరిశీలిస్తున్నామని తెలిపారు.

ఈ మధ్యకాలంలో మోక్షజ్ఞ భగవంత్ కేసరి సినిమా ఈవెంట్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటి సినిమా వేడుకలకి దూరంగా ఉండే మోక్షజ్ఞ రెగ్యులర్ గా మీడియా ముందుకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తన లుక్ పరంగా ఎవ్వరూ ఊహించని రీతిలో చేంజ్ చూపించారు. హీరో మెటీరియల్ గానే తనను తాను సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించుకోవాలనే తపనతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే భగవంత్ కేసరి మూవీ ఈవెంట్స్ లో మోక్షజ్ఞ కనిపిస్తూ ఉండటం మరల అతని ఎంట్రీ గురించి సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. త్వరలో అతని ఎంట్రీకి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ఎనౌన్స్ మెంట్ కి సంబందించి డేట్ అండ్ టైం కూడా ఫిక్స్ చేశారనే టాక్ నడుస్తోంది.

దసరా సందర్భంగా మోక్షజ్ఞ ఎంట్రీపైన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఉంటుందని సినీ వర్గాలలో కూడా చర్చ నడుస్తోంది. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఉండే అవకాశం ఉందని కూడా చెప్పుకుంటున్నారు. కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీతో కాకుండా సింపుల్ గానే తనని తాను పరిచయం చేసుకోవాలని మోక్షజ్ఞ అనుకుంటున్నారంట.

అయితే భారీ బడ్జెట్ చిత్రంతోనే గ్రాండ్ గా లాంచింగ్ కావాలని, దానికి కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కథతో అయితే బెస్ట్ అని భావించి ఇద్దరు, ముగ్గురు దర్శకుల పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారిలో అనిల్ రావిపూడి కూడా ఉన్నారని టాక్. నందమూరి బాలయ్య అభిమానులు కూడా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో స్టార్ హీరోగా ఎదుగుతాడా లేదా అనేది చూడాలనే క్యూరియాసిటీతో ఉన్నారు.