Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ దర్శనంతో మళ్ళీ ఎన్నో డౌట్లు!

టాలీవుడ్‌లో నందమూరి కుటుంబానికి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షగ్న తెరంగేట్రం కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 May 2025 4:00 AM IST
మోక్షజ్ఞ దర్శనంతో మళ్ళీ ఎన్నో డౌట్లు!
X

టాలీవుడ్‌లో నందమూరి కుటుంబానికి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షగ్న తెరంగేట్రం కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. గత ఏడాది ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షగ్న సినిమా అనౌన్స్ అయినప్పుడు ఫ్యాన్స్‌లో జోష్ పీక్స్‌కు చేరింది. కానీ, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల ఢిల్లీలో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు సందర్భంగా మోక్షగ్న కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోల్లో అతని కొత్త లుక్ చూసి, సినిమా ప్లాన్స్ గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోక్షగ్న కుటుంబంతో కలిసి కనిపించాడు. 30 ఏళ్ల వయసులో అతను ఇప్పుడు మరింత పరిణతితో, సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. గతంలో ప్రశాంత్ వర్మ సినిమా కోసం విడుదలైన పోస్టర్లలో మోక్షగ్న కాలేజీ స్టూడెంట్‌లా యవ్వనంగా కనిపించాడు.

కానీ, ఇప్పుడు అతని లుక్ పూర్తిగా మారిపోయింది. ఈ మార్పు చూసిన అభిమానులు, మోక్షగ్న సినిమాల్లోకి రావడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాడా లేక ప్లాన్స్ మార్చుకున్నాడా అని ఆలోచిస్తున్నారు. ప్రశాంత్ వర్మతో మోక్షగ్న సినిమా సోషియో-ఫాంటసీ జోనర్‌లో రాబోతుందని అనౌన్స్ చేశారు. అయితే, గత డిసెంబర్‌లో లాంచ్ అవ్వాల్సిన ఈ సినిమా మోక్షగ్న అనారోగ్యం కారణంగా వాయిదా పడింది.

ఆ తర్వాత ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు వార్తలు వచ్చాయి. కొందరు బాలకృష్ణ స్క్రిప్ట్ సిద్ధం కాకపోవడంతో నిరాశ చెందారని, మరికొందరు మోక్షగ్నకు ప్రశాంత్ స్టైల్ నచ్చలేదని చెప్పారు. ఈ ఊహాగానాల మధ్య, మోక్షగ్న తన తొలి సినిమా కోసం ఇంకా శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, మోక్షగ్న రెండో సినిమా కోసం ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఒక ప్రాజెక్ట్ రెడీ అవుతోందని వార్తలు వచ్చాయి.

అలాగే, బాలకృష్ణ డైరెక్షన్‌లో ‘ఆదిత్య 999 మ్యాక్స్’ అనే సైన్స్ ఫిక్షన్ సీక్వెల్‌లో మోక్షగ్న హీరోగా నటించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కూడా 2025లో మొదలవ్వనుందని టాక్. ఈ వార్తలు చూస్తే, మోక్షగ్న సినిమా ప్లాన్స్ ఆపలేదని, కానీ సరైన స్క్రిప్ట్, టీమ్ కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రపతి భవన్‌లో తీసిన ఫొటోల్లో మోక్షగ్న మాస్ హీరో లుక్‌కి బదులు కాస్త సీరియస్, మెచ్యూర్డ్ లుక్‌లో కనిపించాడు.

ఈ రోజుల్లో ఫిట్‌నెస్ ట్రైనర్లు, న్యూట్రిషనిస్ట్‌ల సాయంతో ఎవరైనా తమ లుక్‌ను మార్చుకోవచ్చు. మోక్షగ్న సినిమాల కోసం సిద్ధమవుతున్నాడు అంటే, హీరో లుక్‌కి తిరిగి రావడం పెద్ద కష్టం కాదు. అయితే, అతని కొత్త లుక్ చూసిన అభిమానులు, సినిమాల్లోకి రాకుండా వేరే దారి ఎంచుకుంటాడేమో అని కాస్త డౌట్ లో ఉన్నారు. మొత్తంగా చెప్పాలంటే, మోక్షగ్న తెరంగేట్రం గురించి ఇంకా స్పష్టత రాలేదు. ప్రశాంత్ వర్మతో సినిమా ఆగినా, వెంకీ అట్లూరి, లాంటి వారితో కొత్త ప్రాజెక్ట్‌లు లైన్‌లో ఉన్నాయి. నందమూరి వారసుడిగా అతనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అభిమానులు మాత్రం మోక్షగ్న త్వరగా సినిమాల్లోకి వచ్చి, తాత ఎన్టీఆర్, తండ్రి బాలకృష్ణ సంప్రదాయాన్ని కొనసాగిస్తాడని ఆశిస్తున్నారు.