Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు ఓకే... స్టార్ హీరో అవ్వడానికి ఎంత టైమ్ పట్టచ్చు...

ఇక రీసెంట్ గా మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా 'బింబిసారా' సినిమాతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారిన వశిష్ఠ డైరెక్షన్ లో మోక్షజ్ఞ మొదటి సినిమా చేయబోతున్నాడు అంటు అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

By:  Tupaki Desk   |   16 Sept 2026 3:00 PM IST
మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు ఓకే... స్టార్ హీరో అవ్వడానికి  ఎంత టైమ్ పట్టచ్చు...
X

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నందమూరి ఫ్యామిలీ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ 'నందమూరి తారక రామారావు' కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతూ డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. ముఖ్యంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని మన ఇండస్ట్రీ ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించాడు... అలాంటి రామారావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీ కి పరిచయమైన నటుడు బాలకృష్ణ. కెరియర్ స్టార్టింగ్ లోనే మాస్ సినిమాలు చేసి తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగాడు. అలాగే నందమూరి ఫ్యామిలీ రెండోవ జనరేషన్ ను ముందుకు తీసుకెళ్లడంలో బాలయ్య సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ టాప్ హీరోగా ముందుకు దూసుకెళుతున్నప్పటికి బాలయ్య బాబు తన కొడుకు అయిన మోక్షజ్ఞని తన వారసుడిగా ప్రకటించడానికి గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఇప్పటివరకు అవేవి కార్యరూపం దాల్చలేదు.

ఇక రీసెంట్ గా మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా 'బింబిసారా' సినిమాతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారిన వశిష్ఠ డైరెక్షన్ లో మోక్షజ్ఞ మొదటి సినిమా చేయబోతున్నాడు అంటు అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. మొత్తానికైతే మోక్షజ్ఞ ను వచ్చే ఏడాది మనం థియేటర్ లో చూడబోతున్నాం. ఇక ఈ క్రమంలోనే మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరిస్తాడా? నందమూరి ఫ్యామిలీ అభిమానులు చాలా సంవత్సరాలుగా అతని మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. వాళ్ళ అంచనాలను మోక్షజ్ఞ అందుకోగలుగుతాడా? లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మొత్తానికైతే మోక్షజ్ఞ లుక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలకు తను ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఆయన కనిపిస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే ఆయన పర్ఫామెన్స్ తో కూడా ప్రేక్షకులను అలరించినట్లయితే మాత్రం చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయే అవకాశమైతే ఉంది...

ఇక టైర్ వన్ హీరోల లిస్టులో చేరడానికి ఆయన ఎన్ని సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు అనేది ఆయన మొదటి సినిమాకి వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఉంటుంది. ఇక బాలయ్య మోక్షజ్ఞ కోసం ఎలాంటి కథలను సెలెక్ట్ చేస్తాడు. ఆ స్టోరీలు ఆయనకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయా లేదా అనేది తెలియాలి. నిజానికి మొదటి సినిమాలో తన యాక్టింగ్ ఎలా ఉంటుంది అనేదాని మీదనే ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ మూడోతరం హీరోలను మినహాయిస్తే మిగిలిన పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో కూడా టైర్ వన్ హీరోల లిస్టులో చేరిపోయారు. ఇక రీసెంట్ గా అక్కినేని అఖిల్ సైతం 'లెనిన్' సినిమాతో సక్సెస్ ని సాధించాడు. కాబట్టి ఆయన కూడా టైర్ వన్ హీరోల లిస్టులోకి చేరడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతటి పోటీ వాతావరణంలో మోక్షజ్ఞ ను టాప్ హీరో గా మార్చడానికి బాలయ్య ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. మొదటి సినిమా తర్వాత ఆయన లైనప్ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే...