Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు సూపర్‌ స్టార్‌ స్థాయి సినిమా...!

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్ పాన్ ఇండియా స్టార్‌ గా మంచి గుర్తింపు దక్కించుకున్నారు

By:  Tupaki Desk   |   3 Jan 2024 5:43 AM GMT
ఎట్టకేలకు సూపర్‌ స్టార్‌ స్థాయి సినిమా...!
X

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్ పాన్ ఇండియా స్టార్‌ గా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుచుతూ వచ్చాయి. ఆయన స్థాయికి తగ్గట్లుగా సినిమాలు వసూళ్లు రాబట్టడం లో విఫలం అయ్యాయి. ఎట్టకేలకు సూపర్‌ స్టార్‌ స్థాయికి తగ్గ సినిమా వచ్చింది.

భారీ యాక్షన్‌ సినిమాలు చేసిన మోహన్‌ లాల్‌ బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరిచారు. కానీ ఈసారి కోర్ట్‌ డ్రామా తో సాగే 'నేరు' సినిమా మాత్రం మలయాళ ప్రేక్షకులతో పాటు ఇతర భాష ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. కోర్ట్‌ రూమ్‌ డ్రామా కాన్సెప్ట్‌ తో రూపొందిన నేరు వంద కోట్ల వసూళ్ల దిశగా దూసుకు పోతుంది.

విడుదల సమయంలో 'సలార్' కారణంగా కాస్త డల్ గా వసూళ్లు నమోదు అయ్యాయి. రెండో వారం లో మాత్రం సలార్‌ పైగా నేరు డామినేషన్‌ క్లీయర్‌ గా కేరళలో కనిపిస్తోంది. ఇప్పటికే కేరళలో చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌ వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల సమాచారం.

ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా మూడు మిలియన్ డాలర్లను వసూళ్లు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. లాంగ్‌ రన్‌ లో మరో మిలియన్ డాలర్లను వసూళ్లు చేసే అవకాశాలు లేకపోలేదు అన్నట్లుగా సమాచారం అందుతోంది.

చాలా కాలం తర్వాత మోహన్‌ లాల్‌ నుంచి ఒక మంచి సినిమా వచ్చినందుకు ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. దృశ్యం చిత్ర దర్శకుడు జీతూ జోషెష్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. దృశ్యం తరహాలోనే ఆసక్తికర సన్నివేశాలు మరియు స్క్రీన్‌ ప్లేతో నేరు సినిమా సాగింది. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ప్రియమణి, అనశ్వర లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శాంతి మాయ దేవి కథను అందించారు.