Begin typing your search above and press return to search.

ఆ హీరోతో 56వ సారి క్రేజీ కాంబో!

స్టార్ హీరోల సినిమా విష‌యంలో ఒకే హీరోయిన్ ని ప‌దే ప‌దే రిపీట్ చేయ‌డం అన్న‌ది చాలా రేర్.

By:  Tupaki Desk   |   21 April 2024 1:30 AM GMT
ఆ హీరోతో 56వ సారి క్రేజీ కాంబో!
X

స్టార్ హీరోల సినిమా విష‌యంలో ఒకే హీరోయిన్ ని ప‌దే ప‌దే రిపీట్ చేయ‌డం అన్న‌ది చాలా రేర్. ఆ కాంబినేష‌న్ కి జ‌నాల్లో విప‌రీత‌మైన క్రేజ్ ఉంటే త‌ప్ప రిపీట్ అవ్వ‌దు. అందులోనూ ఇప్ప‌టి రోజుల్లో అస్స‌లు సాధ్య‌మ‌వ్వ‌డం లేదు. ఎలాంటి హీరోల‌కైనా కొత్త భామ‌ల్ని సెట్ చేస్తున్నారు త‌ప్ప‌! పాత భామ‌ల్ని రిపీట్ చేయ‌డం అన్న‌ది రేర్ గా జ‌రుగుతుంది. అలాంటిదిప్పుడు ఆ ఇద్ద‌రు 56వ సారి క‌లిసి న‌టిస్తున్నారంటే? న‌మ్ముతారా? అవును న‌మ్మాల్సిందే.

మాలీవుడ్‌ హిట్‌ పెయిర్‌ మోహన్‌లాల్ -శోభన జోడీ మరోసారి తెరపై సందడి చేయడానికి రెడీ అవుతోంది. మోహన్‌లాల్‌ హీరోగా తరుణ్‌ మూర్తి దర్శకత్వంలో ఎమ్‌. రంజిత్‌ 'మోహనలాల్‌ 360’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శోభ‌న ఎంపిక‌య్యారు. ఆ విష‌యాన్ని శోభ‌న సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

`మోహన్‌లాల్‌గారి 360వ సినిమాలో నేను నటించబోతున్నా. నాకు గుర్తు ఉన్నంతవరకు ఆయనతో నేను కలిసి చేయబోతున్న 56వ చిత్రం ఇది` అని పేర్కొన్నారు.

1985 లో మ‌ల‌యాళ చిత్రం `అవిడతే పోలే ఇవిడెయుమ్‌`లో తొలిసారి ఈ జంట నటించారు. ఆ త‌ర్వాత `మణిచిత్ర తాళు`- `నాడోడిక్కట్టు` వంటి హిట్‌ చిత్రాల్లో నటించారు. ఇక 1994లో రిలీజ్ అయిన మలయాళ చిత్రం `తేన్మావిన్‌ కొంబాట్‌`లో మెహన్‌లాల్‌.. శోభన లీడ్‌ రోల్స్‌లో మెప్పించారు. ఆ త‌ర్వాత ఎన్నో సినిమాలు ఆ కాంబినేష‌న్ లో తెర‌కెక్కాయి. 2009లో రిలీజ్ అయిన `సాగర్‌` ఆలియాస్‌ జాకీ రీలోడెడ్‌’లో మోహన్‌లాల్‌ హీరోగా నటించగా, శోభన గెస్ట్‌ రోల్‌ చేశారు.

మళ్లీ రెండు ద‌శాబ్దాల త‌ర్వాత మెయిన్ లీడ్స్ లో మోహన్‌లాల్‌- శోభన కలిసి న‌టించ‌డం విశేషం. ప్ర‌స్తుతం మోహ‌న్ లాల్ వ‌య‌సు 63 కాగా..శోభ‌న వ‌య‌సు 54. శోభ‌న వ‌య‌సుక త‌గ్గ‌ట్టే ఈ సినిమా 54వ చిత్రం కావ‌డం కూడా యాధృశ్చికం. మ‌రి 20 ఏళ్ల త‌ర్వాత ఈ కాంబినేష‌న్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాలి.