Begin typing your search above and press return to search.

డ‌బుల్ హ్యాట్రిక్ కాంబినేష‌న్ మ‌ళ్లీ రిపీట్!

తాజాగా మోహ‌న్ లాల్ స‌త్య‌న్ అతిఖండ్ తో మ‌రో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   10 July 2024 6:51 AM GMT
డ‌బుల్ హ్యాట్రిక్ కాంబినేష‌న్ మ‌ళ్లీ రిపీట్!
X

కంప్లీట్ స్టార్ మోహ‌న్ లాల్ ఇప్పుడు అన్ని భాష‌ల చిత్రాల్లోనూ వేగం పెంచారు. కొంత కాలం వ‌ర‌కూ మ‌ల‌యాళ‌నికే ప‌రిమిత‌మైన ఆ స్టార్ హీరో ఇప్పుడు ఇత‌ర భాష‌ల చిత్రాల్లో కీల‌క‌పాత్ర‌లు పోషిస్తూ పాన్ ఇండియాలో ఫేమ‌స్ అవుతున్నారు. అందులోనూ ఎక్కువ‌గా తెలుగు సినిమాలు చేయ‌డం విశేషంగా చెప్పొచ్చు. ఆయ‌నకు ఇక్క‌డి ప్రేక్ష‌కులు అంతే క‌నెక్ట్ అయ్యారు. మోహ‌న్ లాల్ ఎమోష‌నల్ పెర్పార్మెన్స్ అంతా ఫిదా అవుతున్నారు.

ఆ మ‌ధ్య రిలీజ్ అయిన 'జైలర్' సినిమాలోనూ వైవిథ్య‌మైన పాత్ర పోషించి అల‌రించిన సంగ‌తి తెలిసిందే. అలాగ‌ని మాతృభాష‌ని లైట్ తీసుకోలేదు. ఈయ‌న కూడా మూడు షిప్టులు ప‌నిచేసే న‌టుడు. అందుకే ఏడాదికి ఆరు సినిమాల‌కు రిలీజ్ చేస్తున్నారు. ఆయ‌నలా ప‌నిచేసే తెలుగు హీరో ఒక్క‌రు కూడా లేరు. ఆ ర‌కంగా వేగంగా సినిమాలు చేయాల‌నుకునే వారికి మోహ‌న్ లాల్ స్పూర్తి అనొచ్చు. తాజాగా మోహ‌న్ లాల్ స‌త్య‌న్ అతిఖండ్ తో మ‌రో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

ఇదొక సూప‌ర్ ఫ‌న్ ప్రాజెక్ట్. వచ్చే నెల నుంచే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. మునుప‌టి రికార్డులు అన్నింటిని ఈ సినిమా చెరిపేస్తుంద‌ని మ‌ల‌యాళ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అందుకు కార‌ణం లేక‌పోలేదు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఇప్ప‌టికే ఆర సినిమాలొచ్చాయి. అవ‌న్నీ మంచి విజ‌యం సాధిచాయి. బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్లు రాబ‌ట్టాయి. ఒక్క సినిమా కూడా పోలేదు.

దీంతో ఈ కాంబోలో ఏడ‌వ సినిమా కూడా భారీ విజ‌యం సాధిస్తుంద‌ని నెట్టింట పెద్ద చ‌ర్చ సాగుతోంది. ఈ చిత్రానికి జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మోహ‌న్ లాల్ కామన్ మ్యాన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ పాత్ర లో న‌టించ‌డానికి ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్న‌ట్లు తెలిపారు.