Begin typing your search above and press return to search.

ఈ హీరో ఏడాదిలో 34 సినిమాలు చేస్తే 25 హిట్లు

శోభ‌న్ బాబు లాంటి స్టార్లు మినిమం గ్యారెంటీ సినిమాల‌తో ప‌రిశ్ర‌మ‌లో త‌మ‌కంటూ ఒక ఒర‌వ‌డిని సృష్టించుకున్నారు.

By:  Tupaki Desk   |   20 Jan 2024 5:27 AM GMT
ఈ హీరో ఏడాదిలో 34 సినిమాలు చేస్తే 25 హిట్లు
X

శోభ‌న్ బాబు లాంటి స్టార్లు మినిమం గ్యారెంటీ సినిమాల‌తో ప‌రిశ్ర‌మ‌లో త‌మ‌కంటూ ఒక ఒర‌వ‌డిని సృష్టించుకున్నారు. క్లాసిక్ డేస్ లో ఎందరు అగ్ర హీరోలు ఉన్నా ఒక‌దాని వెంట ఒక‌టిగా సినిమాలు చేసేవారు. వ‌రుస హిట్ల‌తో వీళ్ల ట్రాక్ రికార్డ్ ఆస‌క్తిక‌రం. షారుఖ్ ఖాన్- సల్మాన్ ఖాన్- అమీర్ ఖాన్- కమల్ హాసన్- అక్షయ్ కుమార్ ఒకదాని తర్వాత ఒకటిగా వ‌రుస‌ హిట్ చిత్రాలను అందించిన భార‌తీయ‌ హీరోలుగా పాపుల‌ర‌య్యారు. అయితే ఒకే ఏడాదిలో 25 హిట్లిచ్చిన స్టార్ ఎవ‌రైనా భార‌త‌దేశంలో ఉన్నారా? అంటే.. సౌత్ సూపర్ స్టార్ మోహన్ లాల్ పేరు వినిపిస్తుంది. ఆయ‌న రికార్డ్ ఇప్ప‌టికీ చెక్కు చెద‌రకుండా ఉంది.

మోహన్ లాల్ సౌత్ స‌హా దేశ‌వ్యాప్తంగా పాపుల‌రైన‌ మలయాళ సూపర్ స్టార్. అతడు ముఖ్యంగా ద‌క్షిణాది భాష‌ల్లో ఎక్కువ సినిమాల్లో న‌టించ‌డ‌మే గాక ఇక్క‌డ‌ గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఆస్వాధిస్తున్నారు. 40 సంవత్సరాలకు పైగా అజేయంగా సాగించిన‌ కెరీర్ లో 340 కంటే ఎక్కువ చిత్రాలను అందించిన కంప్లీట్ స్టార్ ఆయ‌న‌. వీటిలో ఎక్కువ భాగం హిట్లుగా నిలిచాయి. అయితే 1986లో లాల్ తిరుగులేని రికార్డు సృష్టించారు. మోహ‌న్ లాల్ న‌టించిన‌ 34 సినిమాలు ఆ సంవత్సరంలో విడుదలయ్యాయి. వాటిలో 25 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అయ్యాయి. అతడు ఒకే సంవత్సరంలో అత్యధిక చిత్రాలలో న‌టించ‌డ‌మే గాక‌.. అత్యధిక హిట్ చిత్రాల క‌థానాయ‌కుడిగా రికార్డును సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటికీ బద్దలు కాలేదు.

లాల్ 1978లో తిరనోట్టం అనే సినిమాతో రంగప్రవేశం చేశారు. రామ్ గోపాల్ వర్మ సినిమా కంపెనీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. న‌టుడిగా అజయ్ దేవగన్ - వివేక్ ఒబెరాయ్ లకు గట్టి పోటీనిచ్చారు. ఈ చిత్రం 2002లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటి. ఇందులో మోహన్ లాల్ పోలీస్ కమీషనర్ వీరపల్లి శ్రీనివాసన్ పాత్రను పోషించారు. ఈ చిత్రం 2012లో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు అజయ్ దేవగన్- వివేక్ ఒబెరాయ్ లాంటి హిందీ స్టార్లు మోహన్‌లాల్ నటనకు ముగ్ధులయ్యార‌ని ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ స్వ‌యంగా వెల్లడించారు. లాల్ పై ఆయ‌న గొప్ప‌ ప్రశంసలు కురిపించారు.

సౌత్ సూపర్ స్టార్ మోహన్ లాల్ 25 సినిమాల రికార్డ్ హిట్ల‌లోనే కాదు.. దశరథం- తూవనతుంబికల్- నాడోడికట్టు స‌హా ఎన్నో చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో జ‌న‌తా గ్యారేజ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించారు. కంపెనీ కాకుండా అమితాబ్ బచ్చన్ తో క‌లిసి తీజ్ లో నటించిన లాల్ రాంగోపాల్ వర్మ కే ఆగ్ వంటి బాలీవుడ్ సినిమాల్లో కూడా కనిపించాడు. మోహ‌న్ లాల్ ఇటీవ‌ల‌ `జైలర్‌`లో కనిపించారు. ఇందులో రజనీకాంత్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా లాల్ కీల‌క పాత్ర‌లో అల‌రించిన సంగ‌తి తెలిసిందే