Begin typing your search above and press return to search.

ఓటీటీలోకి క్రేజీగా ఆ రెండు బ్లాక్ బ‌స్ట‌ర్లు!

ప్ర‌తి శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ఓటీటీ తెర‌లు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త సినిమాల చేరిక‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి.

By:  Tupaki Desk   |   21 April 2025 10:30 PM IST
ఓటీటీలోకి క్రేజీగా ఆ రెండు బ్లాక్ బ‌స్ట‌ర్లు!
X

ప్ర‌తి శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ఓటీటీ తెర‌లు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త సినిమాల చేరిక‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. తాజాగా ఓ రెండు హిట్ చిత్రాలు ఓటీటీలోకి రానున్నాయి. వీటిలో L2: ఎంపురాన్ , వీర ధీర సూరన్ స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వస్తున్నాయి.

సూప‌ర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన 'ఎల్ 2 ఎంపురాన్' మలయాళ సినీ ప‌రిశ్ర‌మ‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. దాదాపు రూ. 260 కోట్లకు పైగా వసూల్ చేసిన ఈ సినిమాకి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కాన్సెప్టుతో రూపొందించిన ఈ సినిమాలో ప్ర‌ధాన తార‌ల న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకుంది. ఏప్రిల్ 24 నుండి మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో హాట్‌స్టార్‌లో ఈ సినిమా ప్రసారం కానుంది.

మ‌రోవైపు చియాన్ విక్ర‌మ్ న‌టించిన `వీర ధీర సూరన్: పార్ట్ 2` విమర్శకుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే గాక బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ గురువారం (24 ఏప్రిల్) నుండి ప్రైమ్ వీడియోలో తమిళం, తెలుగు, హిందీ, మలయాళం , కన్నడ భాషలలో ఇది స్ట్రీమింగ్ కానుంది. థియేట‌ర్ల‌కు వెళ్లి పొరుగు భాష‌ల‌ సినిమాల‌ను చూసే ప‌రిస్థితి లేదు. దీంతో ఇప్పుడు ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు తెలుగు ఆడియెన్ కి స్పెష‌ల్ ట్రీట్ ఇవ్వ‌నున్నాయ‌న్న‌మాట‌!