పబ్లిక్ టాక్ : సూపర్ స్టార్‌కి మరో హిట్
తుడరుమ్ సినిమాను తెలుగులోనూ విడుదల చేశారు. అయితే తెలుగులో విడుదల గురించి పెద్దగా హడావుడి లేదు.
By: Tupaki Desk | 27 April 2025 6:42 AMమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ ఏడాది మరో విజయాన్ని 'తుడరుమ్'తో దక్కించుకున్నాడు. సింపుల్ అండ్ స్వీట్ కథ, కథనంతో తరుణ్ మూర్తి ఈ సినిమాను రూపొందించిన తీరు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఎల్ 2 వంటి సూపర్ హిట్ తర్వాత మోహన్ లాల్ నుంచి సినిమా అనగానే అదే స్థాయి భారీ యాక్షన్ సినిమాను అంతా ఊహించారు. అనూహ్యంగా మోహన్ లాల్ నుంచి డీసెంట్ ఫ్యామిలీ స్టోరీ సినిమా వచ్చింది. తన ఫ్యామిలీ పట్ల బాధ్యత, తన కారుపై ఉండే మక్కువతో షణ్ముగం అలియాస్ బెంజ్ ఏం చేస్తాడు అనేది సినిమా కథ. సింపుల్ కథ అయినా కూడా మేకింగ్‌తో హృదయాలను కట్టి పడేశారు అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
'తుడరుమ్' సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో మలయాళ ఇండస్ట్రీ మార్క్ దాటి మోహన్ లాల్ సినిమాలు చేస్తున్నాడంటూ వస్తున్న విమర్శలకు ఆయన ఈ సినిమాతో సమాధానం చెప్పారు. దృశ్యం స్థాయిలో హిట్ కాకున్నా ఆ తరహా ఫ్యామిలీ ఓరియంటెడ్ కథను ఈ సినిమాతో మోహన్ లాల్ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. సినిమాకు విడుదలకు ముందు పెద్దగా హడావిడి చేయలేదు. పెద్దగా ప్రమోషన్ చేయలేదు. కానీ విడుదల తర్వాత మాత్రం సినిమాకు భారీ ఎత్తున పబ్లిసిటీ మౌత్ టాక్‌తోనే దక్కింది. సూపర్ స్టార్ మూవీ అన్నట్లుగా కాకుండా ఒక చక్కని ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అన్నట్లుగా ఈ సినిమా ఉందంటూ ప్రేక్షకులతో పాటు రివ్యూవర్స్ అంటున్నారు.
మోహన్‌లాల్ తప్ప భారీ స్టార్ కాస్ట్ లేదు, భారీ టెక్నికల్ వ్యాల్యూస్ లేకుండానే ఈ సినిమా చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. మోహన్ లాల్ పారితోషికం కాకుండా ఈ సినిమా కేవలం రూ.30 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందినట్లు తెలుస్తోంది. మోహన్ లాల్‌కి జోడీగా సీనియర్ హీరోయిన్ శోభన నటించింది. తక్కువ నిడివితో ఎక్కువ లెంగ్తీ సన్నివేశాలు లేకుండా, బోర్ కొట్టించకుండా స్క్రీన్‌ప్లేను సింపుల్‌గా రూపొందించిన తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలాంటి కథలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎప్పుడూ ఆదరణ లభిస్తుంది. ఆ విషయం మరోసారి ఈ సినిమాతో నిరూపితం అవుతోంది. మోహన్ లాల్ ఆ మధ్య కాలంలో వరుస ఫ్లాప్ సినిమాలతో అభిమానులను నిరాశ పరుస్తూ వచ్చాడు.
2025 ఆరంభంలోనే ఎల్ 2 సినిమాతో సూపర్ హిట్‌ను దక్కించుకున్నాడు. ఆ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం. మోహన్ లాల్ ఇదే ఏడాది తుడరుమ్ సినిమాతో మరోసారి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. సినిమాకు మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్ దక్కాయి. ఈ వీకెండ్‌లో భారీగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మలయాళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు దాదాపుగా రూ.6 కోట్ల వసూళ్లు రాబట్టింది. రెండో రోజు సినిమాకు దాదాపు రూ.9 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. మొదటి వారం పూర్తి కాకముందే సినిమాకు బ్రేక్ ఈవెన్ సాధ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
తుడరుమ్ సినిమాను తెలుగులోనూ విడుదల చేశారు. అయితే తెలుగులో విడుదల గురించి పెద్దగా హడావుడి లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మోహన్ లాల్‌కి తెలుగు మార్కెట్‌లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ సినిమా మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. మోహన్ లాల్ నటించిన పలు సినిమాలు తెలుగులో విడుదల అయ్యి భారీ వసూళ్లు నమోదు చేశాయి. ఈ వీకెండ్‌లో తెలుగు రాష్ట్రాల్లో తుడరుమ్ సినిమాకు డీసెంట్ వసూళ్లు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది.