Begin typing your search above and press return to search.

అక్క‌డ రికార్డుల మోత‌మోగిస్తున్న లాలిట‌న్

అదే 'తుడ‌రుమ్‌' ప‌రువు హ‌త్య నేప‌థ్యంలో సాగే ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. త‌రుణ్ మూర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

By:  Tupaki Desk   |   6 May 2025 11:35 AM IST
Thudarum Box Office
X

మోహ‌ల్ లాల్‌.. మాలీవుడ్ స్టార్స్ అంతా ముద్దుగా పిలుచుకునే పేరు లాలిట‌న్‌. విభిన్న‌మైన సినిమాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్ష‌కుల్ని స‌ర్‌ప్రైజ్ చేస్తుంటారు. త‌న‌దైన మార్కు సినిమాల‌తో మ‌ల‌యాళ బాక్సాఫీస్ లెక్క‌ల్ని స‌రిచేస్తూ స‌రికొత్త రికార్డులు సృష్టిస్తుంటారు. ఇటీవ‌ల `ఎంపూర‌న్ 2`తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన మోహ‌న్‌లాల్ ఈ సినిమాతో మాలీవుడ్‌కు రూ.300 కోట్ల మార్కు వ‌సూళ్ల‌ని ప‌రిచ‌యం చేసి ఔరా అనిపించారు. దీని నుంచి మ‌ల‌యాళ ప్రేక్ష‌కులు బ‌య‌టికి రాక‌ముందే మోహ‌న్ లాల్ మ‌రో థ్రిల్ల‌ర్‌ని అందించారు.

అదే 'తుడ‌రుమ్‌' ప‌రువు హ‌త్య నేప‌థ్యంలో సాగే ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. త‌రుణ్ మూర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఏప్రిల్ 25న మ‌ల‌యాళంతో పాటు తెలుగులోనూ విడుద‌లైంది. అయితే తెలుగులో పెద్ద‌గా ప్ర‌మోష‌న్స్ చేయ‌క‌పోయినా మౌత్ టాక్‌తో మంచి వ‌సూళ్ల‌నే రాబ‌డుతోంది. అంతే కాకుండా మ‌ల‌యాళంలో ఈ సినిమా రికార్డు స్థాయి వ‌సూళ్ల దిశ‌గా ప‌య‌నిస్తూ మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో స‌రికొత్త రికార్డు ద‌శ‌గా ప‌య‌నిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా రూ.100 కోట్ల మార్కుని దాటేసి భారీ వసూళ్ల దిశ‌గా ప‌య‌నిస్తోంది.

మే 9న త‌మిళ వెర్ష‌న్ కూడా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ విడుద‌లై ఇప్ప‌టి వ‌ర‌కు 12 రోజుల‌వుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియావైడ్‌గా ఈ మూవీ రూ.72.20 కోట్లు రాబ‌ట్టింది. గ్రాస్ ప‌రంగా చూస్తే రూ.85.19 కోట్లు.ఓవ‌ర్సీస్ గ్రాస్ రూ.77.50 కోట్లు వ‌సూలు చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా సాధించిన గ్రాస్ రూ.162.69 కోట్లు. విడుద‌లైన అతిత‌క్కువ రోజుల్లోనే ఓ మ‌ల‌యాళ సినిమా ఈ స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం ఇదే తొలి సారి కావ‌డంతో `తుడ‌రమ్‌` ఇండ‌స్ట్రీ రికార్డుని క్రియేట్ చేయ‌డం విశేషం.

మ‌ల‌యాళం త‌ర‌హాలో తెలుగు వెర్ష‌న్‌కు కూడా ప్ర‌మోష‌న్స్ భారీ స్థాయిలో చేసివుంటే ఫ‌లితం రికార్డు స్థాయిలో ఉండేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా మోహ‌న్‌లాల్ మూవీ కేవ‌లం ప‌ది రోజుల్లోనే రికార్డు స్థాయి వ‌సూళ్లు రాబ‌డుతుండ‌టంతో మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ ఊపిరి పీల్చుకుంటోంద‌ట‌. పెద్ద సినిమా ఈ రేంజ్‌లో వ‌సూళ్ల‌ని రాబ‌డితే రానున్న రోజుల్లో మ‌రిన్ని బిగ్ బ‌డ్జెట్ మూవీస్‌కు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌ని ప‌లువురు ట్రేడ్ వ‌ర్గాలు కామెంట్ చేస్తున్నాయి.