Begin typing your search above and press return to search.

నెల గ్యాప్ లో మోహన్ లాల్ వన్స్ మోర్.. మూవీ ఎలా ఉందంటే?

అయితే ఎంపురాన్ రిలీజ్ అయిన నెల రోజుల్లోనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మోహన్ లాల్. తుడరుమ్ తో ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 April 2025 8:00 PM IST
Thudarum Movie Review
X

మాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ లాల్.. రీసెంట్ గా L2: ఎంపురాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. మార్చి 27వ తేదీన థియేటర్స్ లో రిలీజైంది. అయితే సినిమాపై మిక్స్ డ్ రివ్యూస్ వచ్చినా.. వసూళ్ల విషయంలో అదుర్స్ అనే చెప్పాలి.

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి అనేక రికార్డులు క్రియేట్ చేసింది. మాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఎంపురాన్ రిలీజ్ అయిన నెల రోజుల్లోనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మోహన్ లాల్. తుడరుమ్ తో ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తున్నారు.

తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన తుడురుమ్ లో సీనియర్ యాక్ట్రెస్ శోభన నటించడం విశేషం. వీరిద్దరూ చాలా రోజుల తర్వాత కలిసి నటించారు. నిన్న మాలీవుడ్ లో రిలీజ్ అవ్వగా.. నేడు తెలుగులో విడుదలైంది. టాలీవుడ్ లో కూడా తుడురమ్ పేరుతోనే సినిమాను రిలీజ్ చేయడం చాలా మందికి మింగుడుపడటం లేదు.

అయితే తుడురుమ్ లో క్యాబ్ డ్రైవర్ రోల్ పోషించిన మోహన్ లాల్.. సినిమాలో తన యాక్టింగ్ తో అదరగొట్టేశారని అంతా అంటున్నారు. ఎమోషనల్ సీన్స్ లో తన టాలెంట్ ఏంటో చూపించారని చెబుతున్నారు. కామెడీ టైమింగ్ తో మెప్పించారని.. అదే సమయంలో శోభన చాలా కాలం తర్వాత మంచి పాత్రలో కనిపించారని అంటున్నారు.

మోహన్ లాల్ పిల్లలుగా నటించిన వారితోపాటు ప్రకాష్ వర్మ ఒదిగిపోయారని చెబుతున్నారు. షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ, జోక్స్ బిజోయ్ సంగీతం, డైరెక్టర్ తరుణ్ మూర్తి సినిమాను మొదలుపెట్టిన విధానం చాలా బాగుందని చెబుతున్నారు. కానీ మూవీ ఎండింగ్ విషయంలో డైరెక్టర్ వర్క్ సరిగ్గా లేదని సినీ ప్రియులు చెబుతున్నారు.

మొత్తానికి పవర్ ఫుల్ స్టోరీనే అయినా.. లాస్ట్ లో ఎమోషన్ మిస్ చేశారని అంటున్నారు. మాస్ ఎలివేషన్స్ వల్ల స్టోరీలో లాజిక్ తప్పిపోయిందని చెబుతున్నారు. పోలీసులను హతమార్చితే న్యాయం జరిగినట్లు కాదు కదా అని కామెంట్స్ పెడుతున్నారు. అందువల్లే తుడురుమ్ యావరేజ్ థ్లిల్లర్ అని రివ్యూ ఇస్తున్నారు. అయితే ఎంపురాన్ పై రివ్యూస్ మిక్స్ డ్ గా ఉన్నా వసూళ్లు రాబట్టింది. మరి తుడురుమ్ మూవీ సంగతేమవుతుందో వేచి చూడాలి.