గొర్రెలు..గుర్రాలు కాస్తోన్న హీరో తనయుడు!
కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ 400 చిత్రాలకు చేరువలో ఉన్న సంగతి తెలిసిందే. మాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మూడు షిప్టులు పనిచేసే నటుడీయన.
By: Tupaki Desk | 9 May 2025 4:22 PM ISTకంప్లీట్ స్టార్ మోహన్ లాల్ 400 చిత్రాలకు చేరువలో ఉన్న సంగతి తెలిసిందే. మాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మూడు షిప్టులు పనిచేసే నటుడీయన. ఏడాదికి కనీసం ఐదారు సినిమాలైనా ప్రేక్షకుల ముందుకు తీసుకొ స్తుంటారు. అందుకే 400 సినిమాలకు చేరువయ్యారు. ప్రస్తుతం మోహన్ లాల్ 64 ఏళ్లు. అయినా ఆయన సినిమాల స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. యధావిధిగా ఏడాదికి ఐదారు సినిమాలు ఇప్పటికీ రిలీజ్ చేస్తు న్నారు.
ఆ సంఖ్య అంతకు మించే ఉంటుంది గానీ తగ్గదు. మరి మోహన్ లాల్ కి వారసులు లేరా? అంటే ఎందుకు లేరు. ప్రణవ్ అనే కుమారుడు ఉన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి హీరో కూడా అయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా నే కెరీర్ ప్రారంభించాడు. హీరోగా కొన్ని సినిమాలు చేసాడు. ఇప్పటికీ యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. అయితే మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ లా మాత్రం ఇంకా ఫేమస్ కాలేదు.
అయితే ప్రణవ్ కి సినిమాలకంటే ఎక్కువగా ప్రపంచాన్ని చుట్టి రావడం అంటే ఎక్కువ ఆసక్తి అట. వర్క్ అవే అనే పేరుతో బట్టలు.. గిటారు కొన్ని పుస్తకాలు తీసుకుని ప్రపంచ యాత్రకు వెళ్లిపోతాడుట. మళ్లీ తిరిగి ఎప్పుడొస్తాడో కూడా తెలియదట. అంతగా తిరగడం అంటే ఇష్టమట. ప్రస్తుతం ప్రణవ్ స్పెయిన్ లో ఉన్నాడుట. అక్కడో ఓ ఫాంలో గొర్రెలు..గుర్రాలు కాస్తున్నానంటున్నాడు.
తనయుడు అలా కొత్తగా జీవిస్తుంటే తండ్రిగా తనకెంతో సంతోషంగా ఉందని మోహన్ లాల్ అంటు న్నారు. అంతేగా కొడుకు ఆనందం కంటే తండ్రికి అంతకు మించి ఏం కావాలి. ప్రణవ్ ఇటీవల రిలీజ్ అయిన `ఎల్ 2 ఎంపురాన్` లో నటించాడు. `డైస్ అరే` అనే మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఇది పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.