Begin typing your search above and press return to search.

శత్రువులా చూస్తున్నారంటూ మోహన్ లాల్ ఆవేదన!

మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న మోహన్ లాల్.. ఇప్పుడు తనను చాలామంది శత్రువులుగా చూస్తున్నారంటూ ఆవేదన పడుతూ మాట్లాడిన మాటలు అభిమానులకు మింగుడుపడడం లేదు.

By:  Tupaki Desk   |   9 Sept 2025 3:15 PM IST
శత్రువులా చూస్తున్నారంటూ మోహన్ లాల్ ఆవేదన!
X

మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న మోహన్ లాల్.. ఇప్పుడు తనను చాలామంది శత్రువులుగా చూస్తున్నారంటూ ఆవేదన పడుతూ మాట్లాడిన మాటలు అభిమానులకు మింగుడుపడడం లేదు. అసలు విషయంలోకి వెళ్తే.. మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిటీ.. లైంగిక వేధింపులకు సంబంధించిన నివేదిక సమర్పించిన తర్వాత కొంతమంది.. తనపై, తన కమిటీ సభ్యులపై ఆరోపణలు చేయడమే కాకుండా తమను శత్రువుల చూస్తున్నారని పేర్కొన్నారు..

ఇదే విషయంపై మోహన్ లాల్ మాట్లాడుతూ.. "అధ్యక్షుడు అనేది ఒక పదవి మాత్రమే. ఏదైనా సమస్య వస్తే అధ్యక్షుడు ఒక్కడే కారణం కాదు. కానీ ఈ విషయం తెలియక నాపై చాలామంది శత్రుత్వం పెంచుకున్నారు. నిజానికి ఎందుకు నన్ను ఒక శత్రువులా చూస్తున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నాతో పాటు రాజీనామా చేసిన ఇతర వ్యక్తులు తిరిగి కమిటీలోకి వస్తారా? లేదా? అన్నది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం. కానీ అధ్యక్షురాలిగా శ్వేతా మేనన్ ను ఎంచుకోవడం ఒక గొప్ప విషయం.. ఎందుకంటే గతంలో మహిళలు చర్చించలేకపోయిన ఎన్నో విషయాలు ఇప్పుడు ధైర్యంగా చర్చిస్తారు. "అమ్మ"కు సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ నేను సిద్ధంగా ఉంటాను" అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే మలయాళ చిత్ర పరిశ్రమలో.. మహిళలు లైంగిక వేధింపులు ఎక్కువగా ఎదుర్కొంటున్నామంటూ జస్టిస్ హేమ కమిటీలో వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ (అమ్మ) అప్పటి అధ్యక్షుడు మోహన్ లాల్ కూడా రాజీనామా చేశారు. అదే సమయంలో ఆయనతో పాటు మొత్తం 17 మంది సభ్యులు ఉన్న మొత్తం పాలకమండలి కూడా తమ పదవుల నుంచి వైదొలిగారు. ఆ తర్వాతనే ఈ ఏడాది ఎన్నికలు జరగగా శ్వేతా మేనన్ అధ్యక్షురాలిగా ఎన్నికయింది. అంతేకాదు 30 ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మలో తొలిసారి ఒక మహిళ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఇక తాను తన పదవికి రాజీనామా చేసినా అమ్మకి మాత్రం ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు మోహన్ లాల్.

మోహన్ లాల్ సినీ కెరియర్ విషయానికి వస్తే.. మలయాళం సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన ఇటీవల హృదయపూర్వం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పటికే రూ.50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా త్వరలో రూ.100 కోట్ల క్లబ్లో కూడా చేరబోతుందని సమాచారం. అలాగే మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రూ.100 కోట్ల క్లబ్లో చేరిన తొలి హీరోగా మోహన్ లాల్ రికార్డు సృష్టించడమే కాకుండా ఇటీవల వచ్చిన L2: ఎంపురాన్, తుడురమ్ చిత్రాలతో కూడా వరుసగా రూ.50 కోట్ల క్లబ్లో చేరి వరుసగా హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు.

ఇక మరొకవైపు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో దోస కింగ్ బయోపిక్ లో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.. ప్రస్తుతం వృషభ అనే సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.