Begin typing your search above and press return to search.

వెండి తెర‌పై ఊహించ‌ని కాంబినేష‌న్!

అయితే మోహ‌న్ లాల్ ఇప్పుడు ఓ లెజెండ్ తోనే ప‌ని చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. లాల్ తో ఛాన్స్ కోసం ఆ ద‌ర్శ‌కుడే స్వ‌యంగా త‌న సొంత రాష్ట్రానికి వెళ్తున్నారు.

By:  Tupaki Desk   |   5 Feb 2026 4:00 AM IST
వెండి తెర‌పై ఊహించ‌ని కాంబినేష‌న్!
X

కొన్నిసార్లు ఊహించ‌ని కాంబినేష‌న్లు తెర‌పైకి వ‌స్తే షాకింగ్ త‌ప్ప‌దు. క‌నీసం ఊహ‌కి కూడా రాని కాంబినేష‌న్స్ సెట్ అవుతున్న‌ప్పుడు స‌ర్ ప్రైజ్ గా అనిపిస్తుంది. తాజాగా ఓ కాంబినేష‌న్ అలాంటి అనుభూతికే గురి చేస్తోం ది. వివారాల్లోకి వెళ్తే.. మాలీవుడ్ స్టార్ మోహ‌న్ లాల్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంతో మంది ద‌ర్శ‌కుల‌తో ఎన్నో సినిమాలు చేసారు. కంప్లీట్ స్టార్ ట‌చ్ చేయ‌ని జాన‌ర్ అంటూ లేదు. మూడు షిప్టుల్లో ప‌ని చేసిన న‌టుడు. ఏడాదికి క‌నీసం ఆరు సినిమాలైనా రిలీజ్ ఉండేలా చూసుకుంటారు. వేగంగా సినిమాలు పూర్తిచేసి రిలీజ్ చేయ‌డం అన్న‌ది ఆయ‌న‌కే సాద్య‌మైంది.

65 ఏళ్ళ వ‌య‌సులో సైతం అదే దూకుడుతో సినిమాలు చేయ‌డం ఆయ‌న‌కే చెల్లింది. కుటుంబ‌ క‌థ అయినా? యాక్ష‌న్ సినిమా అయినా? క్రైమ్ థ్రిల్ల‌ర్ అయినా..స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అయినా.?..ఇలా జాన‌ర్ ఏది అయినా ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే న‌టుడు. ఆ పాత్ర‌కే వ‌న్నె తేగ‌ల ఓ లెజెండ‌రీ. అయితే అత‌డు ఇప్ప‌టి వ‌ర‌కూ సినిమాల‌న్నీ సౌత్ ద‌ర్శ‌కుల‌తోనే చేసారు. ఇత‌ర భాష‌ల్లో కూడా కీల‌క పాత్ర‌ల్లో అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు వాటిని స‌ద్వినియోగం చేసుకున్నారు. కానీ బాలీవుడ్ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసింది మాత్రం పెద్ద‌గా క‌నిపించ‌దు.

అయితే మోహ‌న్ లాల్ ఇప్పుడు ఓ లెజెండ్ తోనే ప‌ని చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. లాల్ తో ఛాన్స్ కోసం ఆ ద‌ర్శ‌కుడే స్వ‌యంగా త‌న సొంత రాష్ట్రానికి వెళ్తున్నారు. ఇంత‌కీ ఎవ‌రా ద‌ర్శ‌కుడు అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. అత‌డు ఎవ‌రో కాదు. బాలీవుడ్ లెజెండ్ నితీష్ తివారీ. అవును. నితీష్ ఇప్పుడు మోహ‌న్ లాల్ తో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. ఓ కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాన్ని లాల్ తో తెర‌కెక్కించాల‌ని సంక‌ల్పించారుట‌. అందుకోసం ఇండియాలో ఉన్న ఎంతో మంది నటుల్ని పరిశీలించి చివ‌రిగా తాను రాసిన ఆ పాత్ర‌కు లాల్ అయితేనే న్యాయం చేయ‌గ‌లర‌ని భావించారుట‌.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే స్టోరీ వినిపించ‌గా లాల్ మ‌రో మాట లేకుండా క‌మిట్ అయ్యారుట‌. ఇది పూర్తిగా కేర‌ళ నేప‌థ్యంతో సాగే క‌థ. షూటింగ్ అంతా కూడా కేర‌ళ ప‌రిస‌ర‌ ప్రాంతాల్లోనే ఉంటుందిట‌. సినిమా కోసం ఎలాంటి సెట్లు వినియోగించ‌డం లేదుట‌. షూటింగ్ అంతా స‌హ‌జ వాతావ‌ర‌ణంలో నేచుర‌ల్ గా షూట్ చేస్తారుట‌. ఈ సినిమాని స్వ‌యంగా నితిష్ తివారీ నిర్మించాల‌నుకుంటున్నారుట‌. నితీష్ తివారీ `దంగ‌ల్` విజ‌యంతో వ‌ర‌ల్డ్ వైడ్ ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం రామాయ‌ణాన్ని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తూ సంచ‌ల‌నంగా మారారు. ఈ సినిమా షూటింగ్ అనంత‌రం మోహ‌న్ లాల్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుందని తెలుస్తోంది.