Begin typing your search above and press return to search.

మ‌మ్ముట్టి మాత్రం మోహ‌న్ లాల్ లా ఛాన్స్ తీసుకోలేక‌!

మ‌ల‌యాళం స్టార్ హీరో మోహ‌న్ లాల్ సొంత భాష నుంచే ఆరేడు సినిమాలు ఏడాదికి రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు. ఇండ‌స్ట్రీలో మూడు షిప్టులు ప‌నిచేసే న‌టుడీయ‌న‌.

By:  Tupaki Desk   |   22 Jun 2025 3:00 AM IST
మ‌మ్ముట్టి మాత్రం మోహ‌న్ లాల్ లా ఛాన్స్ తీసుకోలేక‌!
X

మ‌ల‌యాళం స్టార్ హీరో మోహ‌న్ లాల్ సొంత భాష నుంచే ఆరేడు సినిమాలు ఏడాదికి రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు. ఇండ‌స్ట్రీలో మూడు షిప్టులు ప‌నిచేసే న‌టుడీయ‌న‌. అంతేనా ఇత‌ర భాష‌ల్లో అవ‌కాశాలు వ‌చ్చినా విడిచి పె ట్ట‌డం లేదు. త‌మిళం, తెలుగు, క‌న్న‌డం , హిందీ ఏ భాష‌లో అవ‌కాశం వ‌చ్చినా? అక్క‌డ న‌టిస్తున్నారు. కీల‌క పాత్ర‌ల‌తో పాటు గెస్ట్ అపిరియ‌న్స్ ఇవ్వ‌డానికి ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేదు.

ఈ మ‌ధ్య కాలంలో తెలుగు, త‌మిళ సినిమాల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. స్టార్ హీరోల చిత్రాల్లో లాల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తు ఆయా భాష‌ల ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్నారు. మోహ‌న్ లాల్ ఈ రెండు భాష‌ల‌కు కొత్తేం కాదు. కొన్ని సంవ‌త్స‌రాల క్రిత‌మే ఎంట్రీ ఇచ్చారు. కానీ మ‌ధ్య‌లో గ్యాప్ తీసుకున్నారు. మ‌ళ్లీ గ‌త నాలుగైదేళ్ల‌గా విరివిగా ఈ రెండు భాష‌ల్లోనూ సినిమాలు చేస్తున్నారు. అయితే మ‌మ్ముట్టి మాత్రం మోహ‌న్ లాల్ లా ఛాన్స్ తీసుకోలేక‌పోతున్నారు? అన్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం.

ఆయ‌న ఇమేజ్ నుంచి బయ‌ట‌కు రావ‌డం లేదు. చేస్తే మాలీవుడ్ లో హీరోగా సినిమాలు చేయ‌డం లేదంటే? ఇత‌ర భాష‌ల్లో కూడా అదే రేంజ్ ఉన్న పాత్ర‌లు వ‌స్తే త‌ప్ప న‌టించ‌డం లేదు. మోహ‌న్ లాల్ లా చిన్న చిన్న పాత్ర‌లు పోషించ‌డానికి మాత్రం ఆయ‌న ముందుకు రావ‌డం లేదు. ఈ క్ర‌మంలో ఇత‌ర భాష‌ల్లో ఆయ‌న క‌నిపించ‌డం చాలా అరుదుగా మారింది. తెలుగులో చివ‌రిగా యాత్ర‌లో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర పోషించారు.

అలాగే అఖిల్ హీరోగా న‌టించిన `ఏజెంట్` చిత్రంలో రా ఏజెంట్ రోల్ పోషించారు. కోలీవుడ్ సినిమా చేసి అయితే ఏకంగా ఐదారేళ్లు అవుతుంది. `పెర్నాబు` సినిమా త‌ర్వాత మ‌ళ్లీ ఆయ‌న అక్క‌డ అభిమానుల‌కు క‌నిపించింది లేదు. మ‌రి ఈ రెండు భాష‌ల్లో మమ్ముట్టి ఎప్పుడు సినిమాలు చేస్తారో చూడాలి. మ‌మ్ముట్టి త‌న‌యుడు దుల్క‌ర్ స‌ల్మాన్ మాత్రం కోలీవుడ్...టాలీవుడ్ టార్గెట్ గా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.