Begin typing your search above and press return to search.

పాఠ్య పుస్తకాల్లో మెగాస్టార్‌, సూపర్‌ స్టార్‌ చరిత్ర

మలయాళ సినిమా అనగానే సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌, మెగాస్టార్‌ మమ్ముట్టీ గుర్తుకు వస్తారు. కేరళలో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా వీరికి అభిమానులు ఉంటారు.

By:  Tupaki Desk   |   3 July 2025 3:34 PM IST
పాఠ్య పుస్తకాల్లో మెగాస్టార్‌, సూపర్‌ స్టార్‌ చరిత్ర
X

మలయాళ సినిమా అనగానే సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌, మెగాస్టార్‌ మమ్ముట్టీ గుర్తుకు వస్తారు. కేరళలో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా వీరికి అభిమానులు ఉంటారు. వీరు కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా సౌత్‌లోని అన్ని భాషలతో పాటు, హిందీ సినిమాల్లోనూ నటించిన విషయం తెల్సిందే. అయిదు దశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో సేవను అందిస్తున్న వీరికి కేరళ ప్రభుత్వం అరుదైన గౌరవంను కట్టబెట్టింది. వీరిద్దరి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చడం జరిగింది. మలయాళ సినిమా గురించి ఈ పాఠ్యాంశంలో చెప్పడం జరిగింది. అంతే కాకుండా మోహన్‌ లాల్‌ యొక్క ప్రత్యేక వ్యాసంను అందులో పొందుపరిచారు.

మోహన్‌ లాల్‌ గతంలో కేరళలోని మహారాజా కాలేజ్‌లో చదివాడు. ఆ కాలేజ్‌ వారు బిఏ సెకండ్‌ ఇయర్‌ చదివే విద్యార్థుల కోసం హిస్టరీ ఆఫ్ మలయాళం సినిమా పాఠ్యాంశంలో మోహన్‌ లాల్‌ జీవిత చరిత్రను అందించడం జరుగుతుంది. ఆయన గొప్పతనం, ఆయన ఇండస్ట్రీలో ఎదిగిన క్రమం, సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా ఎదిగిన తీరును గురించి పాఠ్యాంశంగా పేర్కొనడం జరిగింది. కేరళ మొత్తం కూడా హిస్టరీ ఆఫ్‌ మలయాళం సినిమా ఇండస్ట్రీని విద్యార్థులకు పాఠ్యాంశంగా అందించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లు గతంలోనే రాష్ట్ర సంబంధిత మంత్రి పేర్కొన్నారు. తాజాగా మహారాజా కాలేజ్‌లో మమ్ముట్టీ యొక్క జీవితంను భోదించడం మొదలు పెట్టారు.

మమ్ముట్టీ మలయాళ సినిమా ఇండస్ట్రీలో అత్యంత సీనియర్‌ నటుడిగా నిలిచారు. ఆయన తన సుదీర్ఘమైన సినీ ప్రస్థానం లో దాదాపు 430 సినిమాల్లో నటించాడు. ఇతర హీరోలతో పోల్చితే మమ్ముట్టీ సినిమాల సక్సెస్‌ రేటు ఎక్కువ. కెరీర్‌ ఆరంభం నుంచి కమర్షియల్‌ సినిమాలతో పాటు, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చి పెట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. మమ్ముట్టీ ఇప్పటికీ ప్రధాన పాత్రల్లో సినిమాలను చేస్తున్నాడు. అంతే కాకుండా ఆయన ఇతర హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రల్లోనూ నటిస్తున్నాడు. ఇప్పటికీ హిట్స్ అందుకుంటూనే ఉన్నాడు.

కేరళ సినిమా అనగానే మమ్ముట్టీతో పాటు మోహన్‌ లాల్‌ ప్రముఖంగా గుర్తుకు వస్తాడు. ఆయన కూడా సుదీర్ఘమైన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ప్రధాన పాత్రలు పోసిస్తూ ఉన్నారు. హీరోగా ఈ వయసులో నటించడం అంటే మామూలు విషయం కాదు. కానీ మోహన్‌ లాల్‌ మాత్రం రెగ్యులర్‌గా హీరోగా నటించడంతో పాటు, ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ నటిస్తున్నాడు. మోహన్‌ లాల్‌ తెలుగులో పలు సినిమాల్లో కనిపించారు. ఇటీవల కన్నప్ప సినిమాలో మోహన్‌ లాల్‌ గెస్ట్‌ అప్పియరెన్స్ ఇచ్చిన విషయం తెల్సిందే. మొత్తానికి వీరిద్దరి గురించి పాఠ్యపుస్తకాల్లో అదీ బీఏ హిస్టరీ బుక్స్‌ లో వీరి గురించి చేర్చడం అనేది కచ్చితంగా మంచి పరిణామం అంటూ సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.