ఇదెక్కడి విడ్డూరం.. ఒరిజినల్ లో హీరో.. రీమేక్ లో గెస్ట్ రోల్.. ఆ హీరో ఎవరంటే?
మలయాళ నటుడు మోహన్ లాల్ సౌత్ ఇండియా సినీ దిగ్గజ స్టార్ లలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్నారు.
By: Madhu Reddy | 24 Aug 2025 11:00 PM ISTమలయాళ నటుడు మోహన్ లాల్ సౌత్ ఇండియా సినీ దిగ్గజ స్టార్ లలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్నారు. అయితే అలాంటి ఈ హీరో ఏదైనా సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారంటే కచ్చితంగా సినిమాకి భారీ హైప్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఉంది. అదేంటంటే ఒరిజినల్ సినిమాలో హీరోగా చేసిన ఈయన.. రీమేక్ గా తెరకెక్కుతున్న అదే సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారట.. అయితే వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం అంటున్నారు దర్శకుడు. మరి ఇంతకీ మోహన్ లాల్ నటించిన సినిమా ఏది..? దానికి రీమేక్ గా వస్తున్న సినిమా ఏంటి? ఆ సినిమాలో మోహన్ లాల్ అతిథి పాత్రలో కనిపించడం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రియదర్శన్ డైరెక్షన్ లో బాలీవుడ్ స్టార్స్ కొత్త మూవీ..
మలయాళ నటుడు మోహన్ లాల్ ఇప్పటి వరకు 99 సినిమాల్లో నటించారు. వచ్చే సంవత్సరం ఆయన 100వ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుందని దర్శకుడు ప్రియదర్శన్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మరో విషయం కూడా బయటపెట్టారు. అదేంటంటే.. ప్రియదర్శన్ డైరెక్షన్లో ప్రస్తుతం 'హైవాన్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోలుగా బాలీవుడ్ స్టార్ లు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ లు నటిస్తున్నారు. ఈ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ అతిథి పాత్రలో మెరవబోతున్నారట.. అవును మీరు వినేది నిజమే.. హైవాన్ మూవీలో మోహన్ లాల్ గెస్ట్ రోల్ పోషిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు చెప్పుకొచ్చారు.
తన సినిమా రీమేక్ లో గెస్ట్ గా మోహన్ లాల్..
కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన అతి పెద్ద విచిత్రం ఏమిటంటే.. హైవాన్ మూవీ మోహన్ లాల్ 2016 లో నటించిన ఒప్పం మూవీకి రీమేక్.. దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఈ సినిమాని మళ్ళీ బాలీవుడ్ స్టార్లు అయినటువంటి అక్షయ్ కుమార్,సైఫ్ అలీఖాన్ తో ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్నారు..
అలా మోహన్ లాల్ , సముద్రఖని కీలకపాత్రల్లో నటించిన ఒప్పం మూవీకి రీమేక్ గా హైవాన్ మూవీ తెరకెక్కుతున్నట్టు దర్శకుడు చెప్పుకొచ్చారు.. అయితే హైవాన్ మూవీ రీమేక్ అయినప్పటికీ డైలాగ్ లు, స్క్రీన్ ప్లే పూర్తిగా కొత్తగా ఉంటాయని, ఒప్పం మూవీ నుండి తీసుకోవడం లేదంటూ దర్శకుడు ప్రియదర్శన్ క్లారిటీ ఇచ్చారు.. అలా ఒప్పం మూవీకి రీమేక్ గా తెరకెక్కుతున్న హైవాన్ మూవీ లో మోహన్ లాల్ అతిథి పాత్రలో కనిపించడానికి ఒప్పుకోవడం నిజంగా విశేషమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన హీరోగా నటించిన ఒరిజినల్ సినిమాకి రీమేక్ గా వస్తున్న హైవాన్ మూవీలో తిరిగి ఆయనే అతిథి పాత్రలో కనిపించడం అంటే మామూలు విషయం కాదు.. ఇక హైవాన్ మూవీలో మోహన్ లాల్ గెస్ట్ రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని, స్క్రీన్ పై ఆయన కనిపించినంత సేపు ప్రేక్షకులు సర్ప్రైజ్ అవుతారు అంటూ దర్శకుడు చెప్పుకొచ్చారు..
షూటింగ్ కూడా సేమ్ ప్లేస్..
అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ల కాంబోలో రాబోతున్న హైవాన్ మూవీ గురించి దర్శకుడు ప్రియదర్శన్ మాట్లాడుతూ.. "హైవాన్ సినిమా షూటింగ్ ని ముంబై లో చేద్దామనుకున్నాం.కానీ పర్మిషన్ ఇవ్వకపోవడంతో తిరిగి కొచ్చిలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం.అయితే ఒరిజినల్ కథని ఏ ప్రాంతంలో అయితే తీసామో రీమేక్ ని కూడా అదే ప్రాంతంలో తీయడం నిజంగా విశేషమే" అంటున్నారు డైరెక్టర్.. ఎందుకంటే మోహన్ లాల్, సముద్రఖని నటించిన ఒప్పం మూవీ షూటింగ్ మొత్తం కొచ్చిలోనే జరిగింది. దీనికి రీమేక్ గా తెరకెక్కుతున్న హైవాన్ మూవీ షూటింగ్ కూడా కొచ్చి లోనే జరుగుతుండడం విశేషం అని చెప్పుకోవచ్చు.
