హృదయపూర్వం ఇదేదో వర్క్ అయ్యేలా ఉందే..!
ఈ క్రమంలో లేటెస్ట్ గా మోహన్ లాల్ కొత్త సినిమా హృదయపూర్వం సినిమా టీజర్ వచ్చింది.
By: Tupaki Desk | 22 July 2025 9:54 AM ISTమలయాళ స్టార్ మోహన్ లాల్ డిఫరెంట్ కథలతో ఆయన చేసే ప్రయత్నాలు అదిరిపోతాయి. స్టార్ ఇమేజ్ అంతటినీ పక్కన పెట్టి మోహన్ లాల్ చెప్పే కథలు.. చేసే పాత్రలు ఆడియన్స్ కి భలే నచ్చేస్తాయి. అంతేకాదు కొన్నిసార్లు ఎంచుకునే కథలు కేరళలో సాధారణ వ్యక్తుల పాత్రల్లా అనిపిస్తాయి. ఐతే ఆ పాత్రల చుట్టూ కొందరు వ్యక్తులు వారి అభిప్రాయాలు భలే అనిపిస్తాయి.
ఈ క్రమంలో లేటెస్ట్ గా మోహన్ లాల్ కొత్త సినిమా హృదయపూర్వం సినిమా టీజర్ వచ్చింది. అది చూశాక మోహన్ లాల్ ఎంత మంచి వాడే తెలుస్తుంది. సత్యన్ అంతికద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హృదయపూత్వం సినిమాలో మాళవిక మోహనన్, సంగీత్ ప్రతాప్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఆషిర్వాద్ సినిమాస్ బ్యానర్ లో ఆంటోని పెరుంబవూర్ ఈ మూవీ నిర్మిస్తున్నారు.
ఇక ఈ టీజర్ విషయానికి వస్తే మోహన్ లాల్ కేరళ నుంచి వచ్చానని అవతల వ్యక్తికి చెబితే అతను కేరళ నాకు ఫాఫా చాలా ఇష్టం అంటాడు. ఫాఫా ఎవరా అన్నట్టు మోహన్ లాల్ ఎక్స్ ప్రెషన్ ఉంటే ఫహద్ ఫాజిల్ అని అవతల వ్యక్తి చెబుతాడు. ఐతే మోహన్ లాల్ అతనే కాదు సీనియర్ యాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారని అంటాడు.
కానీ అతను ఫాఫానే నా బెస్ట్ అంటాడు.. అప్పుడు మోహన్ లాల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక ఆ తర్వాత కాలు నొప్పితో బాధపడుతూ నానా ఇబ్బందులు పడతాడు. ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర చాలా కామెడీగా ఉండబోతుందని అర్ధమవుతుంది. మలయాళంలో ఇలాంటి సినిమాలు బాగా వర్క్ అవుట్ అవుతాయి. మోహన్ లాల్ మరోసారి తన వర్సటాలిటీతో అదరగొట్టేలా ఉన్నారు.
హృదయపూర్వం టీజర్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. సినిమా తప్పకుండా మోహన్ లాల్ ఫ్యాన్స్ నే కాదు సినీ లవర్స్ ని మెప్పించేలా ఉంది. సినిమా సినిమాకు కొత్త కథలతో తమ స్టోరీ టెల్లింగ్ తో ఆడియన్స్ ని ఇంపాక్ట్ చేస్తారు మలయాళం మేకర్స్. హృదయపూర్వం కూడా అక్కడ నుంచి వస్తున్న మరో లాఫ్ రైడ్ లా ఉంది. ఈ సినిమా ఎప్పుడొస్తుందన్నది ఇంకా డీటైల్స్ రావాల్సి ఉంది. రాజా సాబ్ బ్యూఈ మాళవిక మోహనన్ ఈ సినిమాలో నటించింది.
