నెల్లూరు చేపల పులుసు అభిమాన హీరో!
ఆంధ్రా నెల్లూరు చేపల పులుసు ఎంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంలో ఎన్నిరకాల నాన్ వెజ్ వంటకాలు అందుబాటులో ఉన్నా? నెల్లూరు పులుసంటే ఇష్టపడని ఫిష్ ప్రియులు ఉండరు.
By: Tupaki Desk | 28 April 2025 1:00 AM ISTఆంధ్రా నెల్లూరు చేపల పులుసు ఎంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంలో ఎన్నిరకాల నాన్ వెజ్ వంటకాలు అందుబాటులో ఉన్నా? నెల్లూరు పులుసంటే ఇష్టపడని ఫిష్ ప్రియులు ఉండరు. అందులో నేను ఒకరిని అంటూ మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ కూడా ముందుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన పుడ్ ప్రియుడు అన్న విషయాన్ని రివీల్ చేసారు. `నేను మంచి పుడీ. ఇంట్లో ఉంటే రకరకాల వె రైటీలు ఉండాల్సిందే.
ఎక్కడికి వెళ్లినా స్థానిక వంటకాలు తప్పకుండా రుచి చూస్తా. అలా టేస్ట్ చేయకపోతే ఏదో వెలితిలా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు తప్పకుండా నెల్లూరు చేపల పులుసు తింటా. చాలా రుచిగా ఉంటుంది. ఆ రుచి ఇంకెక్కడా రాదు. ఇంట్లో చాలాసార్లు ట్రై చేసాను కానీ ఆ టేస్ట్ రాలేదు. పెసరట్టు కూడా బాగా నచ్చుతుంది. తినడం ఎంత ఇష్టమో వండటం కూడా అంతే ఇష్టం.
కోకోనట్ చికెన్ రోస్ట్, పండుగప్ప ప్రై చేసాంటే దిమ్మతిరిగిపోతుంది. ఇంట్లో వాళ్లు ఒక్క కూడా మిగల్చ కుండా లాగించేస్తారు` అన్నారు. మొత్తానికి మోహన్ లాల్ కూడా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైపు అని తెలుస్తోంది. తారక్ కి చికెన్ బిర్యానీ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. అదే బిర్యానీ వండి వడ్డించడం అంటే ఇంకా ఇష్టం. అలాగే మెగాస్టార్ చిరంజీవికి కోడిగుడ్డు..చేపల పులుసు అంటే అంతే ఇష్టం.
నటసింహ బాలకృష్ణ కూడా మంచి భోజన ప్రియుడు. ఏ రోజు ఏ వంటకం చేయాలో? ఛాన్స్ తీసుకునేది సింహమే. ఇంట్లో కుక్ కి ముందే చెప్పి వస్తారు. బటయ ఉంటే? ఇంటికి బయల్దేరే ముందు ఏ వంట చేయాలో ప్రిపరేషన్ తో సహా క్లియర్ గా చెబుతుంటారు. ఇది బాలయ్య ప్రత్యేకత. అలాగే నాగార్జున కూడా డైటింగ్ పేరుతో కడుపు కాల్చుకోరు. ఇష్టమైనవి అన్నీ తింటారు. రోజు రాత్రి పూట డిజర్ట్ తప్పనిసరి.
