స్టార్ హీరోకి డాడ్ గా సూపర్ స్టార్!
తాజాగా శివ కార్తికేయన్ కు కూడా డాడీ కాబోతున్నారు. 'గుడ్ నైట్' ఫేం వినాయక్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది.
By: Tupaki Desk | 12 May 2025 7:30 AMకంప్లీట్ స్టార్ మోహన్ లాల్ ఇప్పటికే స్టార్ హీరోలకు డాడీ పాత్రలు పోషించడం మొదలు పెట్టారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి డాడీగా నటించిన సంగతి తెలిసిందే. 'జనతా గ్యారేజ్' లో సమాజంలో చీడపురుగుల్ని ఏరేసే పాత్రలో మోహన్ లాల్ పాత్ర ఎంతో శక్తివంతమైనది. తండ్రి వారసత్వాన్ని కొనసాగించే పాత్రలో తారక్ అభినయం అద్భుతం.
తాజాగా శివ కార్తికేయన్ కు కూడా డాడీ కాబోతున్నారు. 'గుడ్ నైట్' ఫేం వినాయక్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ఓ కీలక పాత్రకు మోహన్ లాల్ ఎంపికయ్యారు. ఆరా తీస్తే అది శివకార్తికేయన్ తండ్రి రోల్ అని తెలిసింది. తండ్రి కొడుకుల అనుబంధాల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. పేరున్న స్టార్ హీరో అయితే బాగుంటుందని మోహన్ లాల్ ని సంప్రదించడంతో ఆయన వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
డాడ్ పాత్రలకు కంప్లీట్ స్టార్ వందశాతం న్యాయం చేసే నటుడు. ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన మోహన్ లాల్ డాడీ పాత్రలతోనే క్రేజీగా మారుతున్నారు. ఆ పాత్రల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఓవైపు మాలీవుడ్ లో హీరోగా సినిమాలు చేస్తూనే ఇతర భాషల్లో కీలక పాత్రలతోనూ మెప్పించడం లాల్ కే చెల్లింది.
ఇప్పటికే కోలీవుడ్..టాలీవుడ్ లో చాలా చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. నటుడిగా 400 చిత్రాలకు అతి చేరువలో ఉన్నారు. హీరోగా...మిగతా భాషల్లో నటించిన చిత్రాలన్ని కలిపితే ఆ లెక్క తేలింది. 60 ఏళ్లు పైబడినా ఇప్పటికే అంతే యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో సైతం లాల్ తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నారు.