దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో మెగాస్టార్ అపార్ట్‌మెంట్?
మాలీవుడ్ దిగ్గజ నటుడు మోహన్ లాల్ దుబాయ్ లో భారీ పెట్టుబడులు పెట్టడం ఇటీవల చర్చకు వచ్చింది.
By: Tupaki Desk | 10 Jun 2025 9:49 AM ISTదుబాయ్ ఆకాశహార్మ్యాల్లో సినీ సెలబ్రిటీలు పెట్టుబడి పెట్టడం కొత్తేమీ కాదు. బాలీవుడ్ సహా మాలీవుడ్ లో పలువురికి దుబాయ్, అరబ్ ఎమిరేట్స్ లో భారీ విల్లాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక రాజధాని ముంబై నుంచి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు అరబ్ దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. సినీ సెలబ్రిటీలు అపార్ట్ మెంట్లు కొంటున్నారు. కొందరు సినీ సెలబ్రిటీలు దుబాయ్ సహా ఎమిరేట్స్ లో భారీ రియల్ వ్యాపారం చేస్తున్నారు.
మాలీవుడ్ దిగ్గజ నటుడు మోహన్ లాల్ దుబాయ్ లో భారీ పెట్టుబడులు పెట్టడం ఇటీవల చర్చకు వచ్చింది. దుబాయ్- బుర్జ్ ఖలీఫాలోని 29వ అంతస్తులో మోహన్‌లాల్ 940 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక విలాసవంతమైన సింగిల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌ను మోహన్ లాల్ సొంతం చేసుకున్నారని తెలిసింది. ఈ అపార్ట్‌మెంట్ దుబాయ్ ఫౌంటెన్ సుందరమైన దృశ్యాన్ని హైలైట్ చేస్తుంది. లాల్ అపార్ట్ మెంట్ ధర దాదాపు రూ. 35 మిలియన్లు (సుమారు 2.8 మిలియన్ దిర్హామ్‌లు) ఉంటుందని అంచనా. ఇది అతని భార్య సుచిత్ర మోహన్‌లాల్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది.
ఈ అపార్ట్ మెంట్ కొనుగోలు చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. లాల్ నిరంతరం వ్యక్తిగత లేదా వృత్తిపరమైన కారణాల వల్ల నిరంతరం దుబాయ్‌కి వెళుతుంటారు. అలా వెళ్లినప్పుడు తన సొంత అపార్ట్ మెంట్ లో ఉంటే అది సౌకర్యంగా ఉంటుందని భావించారట. ఈ పార్ట్ మెంట్ తో పాటు దుబాయ్‌లోని అరేబియన్ రాంచెస్‌లో ఒక విల్లా, దుబాయ్‌లోని పిఆర్ హైట్స్ రెసిడెన్స్‌లో ట్రిపుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌ను కూడా కలిగి ఉన్నాడు. ఈ ఏడాది మోహన్ లాల్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇదే హుషారులో లాల్ భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తన సంపాదనను రియల్ వెంచర్లలో పెట్టుబడులుగా పెడుతున్నారు.