కుమార్తె ఎంట్రీతో ఫ్యామిలీ అంతా ఒకే ప్రేమ్ లో!
అంతటి ఇమేజ్ ఉన్న స్టార్ కుమార్తె కోసం బరిలోకి దిగడం విశేషం. తనయుడు ప్రణవ్ లాల్ కూడా ఓ పాత్ర పోషిస్తున్నట్లు వినిపిస్తుంది.
By: Tupaki Desk | 3 July 2025 3:00 AM ISTకంప్లీట్ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ `తుడక్కం` చిత్రంతో మాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రాన్ని మోహన్ లాల్ తన సొంత నిర్మాణ సంస్థ అశీర్వద్ సినిమాపై నిర్మిస్తున్నారు. `2018` ఫేం జూడ్ అంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నాడు. `తుడక్కం` ఓ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఇటీవలే పట్టాలెక్కింది. ఇందులో హీరో ఎవరు? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇందులో ఓ కీలక పాత్రలో మోహన్ లాల్ కూడా నటిస్తున్నట్లు సమాచారం.
అలాగే మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ లాల్ కూడా నటించే అవకాశాలున్నట్లు వినిపిస్తుంది. ఆసంగతి పక్కన బెడితే? కుమార్తె కోసం మోహన్ లాల్ తన ఇమేజ్ ని సైతం పక్కనబెట్టి పనిచేస్తున్నట్లే. మాలీవుడ్ లో మోహన్ లాల్ పెద్ద స్టార్. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఇప్పటికే 400 చిత్రాలకు అతి చేరువలో ఉన్నారు. తమిళం, తెలుగు భాషల్లో కూడా ఎన్నో చిత్రాలు చేసారు. ఈ మధ్య కాలంలో ఈ రెండు భాషల్లో ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు.
అంతటి ఇమేజ్ ఉన్న స్టార్ కుమార్తె కోసం బరిలోకి దిగడం విశేషం. తనయుడు ప్రణవ్ లాల్ కూడా ఓ పాత్ర పోషిస్తున్నట్లు వినిపిస్తుంది. ప్రణవ్ సినిమాలు చేయడం రేర్. బాగా నచ్చిన కథలు దొరికితే తప్ప నటించే ఆసక్తి చూపించాడు. సినిమాల కంటే ట్రావెలింగ్ అంటే ఇష్టం. నేచర్ ను ఇష్టపడుతూ ప్రపంచ దేశాలు తిరగగం ఓ హాబీ. కానీ సోదరి కోసం ఆ ప్రపంచానికి కొన్ని రోజులు దూరంగా ఉండాల్సిన పరిస్థిలు.
ముగ్గురు కలిసి నటించడం అధికారికమైతే? ఇదే తొలి సినిమా అవుతుంది. మోహన్ లాల్-ప్రణవ్ గతంలో ఒకే ప్రేమ్ లో కనిపించారు. కానీ అప్పటికీ కుమార్తె ఎంట్రీ జరగకపోవడంతో సాధ్యపడలేదు. తాజా సినిమా తో అందుకు ఆస్కారం కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాల న్నది లాల్ ప్లాన్. షూటింగ్ పేరుతో ఎక్కువ సమయం తీసుకోవడం లాల్ కు నచ్చదు. ఎలాంటి స్క్రిప్ట్ అయినా వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నదే లాల్ తాపత్రయం.
