Begin typing your search above and press return to search.

క‌లెక్ష‌న్ కింగ్ 48 న‌ట ప్ర‌స్థానం!

దాదాపు ఆయ‌న కెరీర్ ఐదు ద‌శాబ్దాల‌కు అతి చేరువ‌లో ఉంది. 2023 తో ఆయ‌న న‌ట జీవితం 48 ఏళ్లు పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా విల‌క్ష‌ణ న‌టుడి గురించి కొన్ని ప్ర‌త్యేక విష‌యాలు...

By:  Tupaki Desk   |   22 Nov 2023 12:35 PM GMT
క‌లెక్ష‌న్ కింగ్ 48 న‌ట ప్ర‌స్థానం!
X

క‌లెక్ష‌న్ కింగ్..విల‌క్ష‌ణ న‌టుడు..న‌ట ప్ర‌పూర్ణ మోహ‌న్ బాబు తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అందిస్తోన్న సేవ‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టుడిగా త‌న‌కంటూ ప్రత్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకుని ప‌రిశ్ర‌మ‌లో నిరంత‌రం ఆయ‌న సేవ‌లు కొన‌సాగుతున్నాయి. దాదాపు ఆయ‌న కెరీర్ ఐదు ద‌శాబ్దాల‌కు అతి చేరువ‌లో ఉంది. 2023 తో ఆయ‌న న‌ట జీవితం 48 ఏళ్లు పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా విల‌క్ష‌ణ న‌టుడి గురించి కొన్ని ప్ర‌త్యేక విష‌యాలు...

1974 లో 'అల్లూరి సీతారామ‌రాజు' సినిమాతో ఆయ‌న సినీ ప్ర‌స్థానం మొద‌లైంది. ఆ త‌ర్వాత 'క‌న్న‌వారి క‌ల‌లు' అనే సినిమాలో న‌టించారు. ఆ రెండు సినిమాల్లో మోహ‌న్ బాబు పాత్ర పెద్ద‌గా హైలైట్ కాలేదు. తొలిసారి 'స్వ‌ర్గం న‌ర‌కం' అనే సినిమాతో ఆయ‌న హీరోగా ఇంట్రీ ఇచ్చారు. అక్క‌డ నుంచి ఆయ‌న జ‌ర్నీ వెన‌క్కి తిరిగి చూడ‌కుండా సాగింది. 1976 నుంచి న‌టుడిగా మ‌రింత బిజీ అయ్యారు. వ‌రుస‌గా సినిమాల సంఖ్య అప్ప‌టి నుంచి అంత‌కంత‌కు పెరుగుతూ వ‌చ్చింది. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ప్ర‌యాణం మొద‌లు పెట్టి హీరో ..విల‌న్ అన్ని ర‌కాల పాత్ర‌ల‌తో న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు.

విల‌క్ష‌ణ న‌టుడు అనే ట్యాగ్ ఆయ‌న‌లో వేరియేష‌న్స్ గుర్తించే ఇండ‌స్ట్రీ ఇచ్చింది. ఆరంభంలో అందరికీ ఎదురైనట్టుగానే ఎన్నో అవమానాలు.. ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురయ్యాయి. ఆయన అకుంఠిత భావం, కష్టపడే తత్త్వం.. అంకిత భావంతో కష్టపడి ఎదిగారు. ఇక డైలాగులు ప‌ల‌క‌డంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఉంద‌ని ఆనాడే ముద్ర వేసారు. పాత్ర‌ల్ని బ‌ట్టి ఆయ‌న డైలాగ్ లు ఎంతో అద్భుతంగా చెప్పేవారు.

ఆయ‌న డైలాగ్ తోనే థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లేవి. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ రామారావు త‌ర్వాత డైలాగ్ డిక్ష‌న్ లో ఆయ‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఉంద‌ని ముద్ర వేసుకున్నారు. న‌టుడిగా మోహ‌న్ బాబు మ్యాన‌రిజ‌మ్ ఆయ‌న్ని మిగ‌తా న‌టుల్ని నుంచి వేరు చేసింది. ఆ క్వాలిటీ ఆయ‌న‌కు ఎన్నో కొత్త అవ‌కాశాలు సృష్టించింది. ఇక‌ సినిమాల్లో సంపాదించింది అక్క‌డే పోగొట్టాలి అన్న‌ది ఆయ‌న నైజం. సొంతంగా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ మీద ఎన్నెన్నో హిట్ చిత్రాలు నిర్మించి నిర్మాత‌గానూ అభిరుచిని చాటుకున్నారు. మోహ‌న్ బాబు సేవ‌లకు గానూ ఎన్నో అవార్డుల‌..రివార్డులు అందుకున్నారు. గౌరవ డాక్టరేట్.. 'పద్మశ్రీ' తోనూ ఆయ‌న్ని స‌త్కరించారు. ప్ర‌స్తుతం విష్ణు హీరోగా తెర‌కెక్కుతోన్న 'క‌న్న‌ప్ప' చిత్రాన్ని మోహ‌న్ బాబు భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో ఆయ‌న ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు స‌మాచారం.