Begin typing your search above and press return to search.

దర్శకుడికి స్వేచ్చని ఇచ్చిన నిర్మాత ఆయన..!

ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి స్పీచ్ ప్రేక్షకులను అలరించాయి.

By:  Tupaki Desk   |   27 April 2025 2:04 PM
దర్శకుడికి స్వేచ్చని ఇచ్చిన నిర్మాత ఆయన..!
X

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సారంగపాణి జాతకం సినిమా శుక్రవారం రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ప్రియదర్శి, రూప, వెన్నెల కిషోర్, హర్ష ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి స్పీచ్ ప్రేక్షకులను అలరించాయి.

మైక్ అందుకుని స్పీచ్ మొదలు పెట్టిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి నిర్మాత కృష్ణ ప్రసాద్ గురించి మాట్లాడారు. నిర్మాత కృష్ణ ప్రసాద్ గారికి థాంక్స్. మేమిద్దరం 3 సినిమాలు చేశాం.. మంచి అభిరుచి, సినిమా పట్ల ప్రేమ, దర్శకుడికి స్వేచ్చ ఇచ్చే నిబద్ధత ఉన్న నిర్మాత ఆయన. ఇప్పటి ప్రొడ్యూసర్స్ కి అది కరువవుతుందని అన్నారు మోహనకృష్ణ.

అంతేకాదు ఛాన్స్ ఇచ్చిన దగ్గర నుంచి పక్కన కుర్చీ వేసుకుని ఇది ఇలా తీయాలేమో అది అలా తీయాలేమో అని సతాయించకుండా.. దర్శకుడిని పూర్తిగా నమ్మి పూర్తి స్వేచ్చని ఇచ్చి కథ విన్నాక మళ్లీ సినిమా గురించి పట్టించుకోలేదని అన్నారు మోహనకృష్ణ. నన్ను నమ్మి 3 సినిమాలు తీసినందుకు కృతజ్ఞతలు.. 3 మంచి సినిమాలు తీశాం కాబట్టి అభినందనలు.. మనం గర్వించదగ్గ సినిమాలు తీశాం. ప్రేక్షకులు పది కాలాలు గుర్తుంచుకునే సినిమాలు తీశామని అన్నారు మోహనకృష్ణ ఇంద్రగంటి.

సారంగపాణి జాతకం ఎంతో ప్రేమించి ఇష్టపడి రాసుకున్న కథ ఐతే తాను ఎంతగా ఇష్టపడ్డానో కృష్ణ ప్రసాద్ కూడా అంతే ప్రేమించి ఒకరోజులో సినిమాకు ఓకే చెప్పారని అన్నారు. ఇక ఈ సినిమాలో నటించిన ప్రియదర్శి గురించి మాట్లాడుతూ నేను నమ్మిన దానికన్నా 1000 రెట్లు ఎక్కువ చేశాడని అన్నారు ఇంద్ర్గంటి మోహనకృష్ణ. సినిమాలో నటించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడి వాళ్లందరి వల్లే ఇది సాధ్యమైందని అన్నారు దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ సినిమాను పెద్ద బ్లాక్ బస్టర్ చేయాలి. ఫ్యామిలీస్ అంతా కూడా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని అన్నారు దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి.