Begin typing your search above and press return to search.

సావిత్రి సాంగ్ కు పిచ్చి డ్యాన్స్.. డైరెక్టర్ అప్పుడలా.. ఇప్పుడిలా..

ఇప్పుడు ఆ విషయంపై సారంగపాణి జాతకం మూవీ ఈవెంట్ లో మోహన్ కృష్ణ రెస్పాండ్ అయ్యారు.

By:  Tupaki Desk   |   17 April 2025 6:24 PM IST
సావిత్రి సాంగ్ కు పిచ్చి డ్యాన్స్.. డైరెక్టర్ అప్పుడలా.. ఇప్పుడిలా..
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మహానటి సావిత్రి నటించిన మాయాబజార్ మూవీ ఓ ఎవర్ గ్రీన్ క్లాసిక్ అనే చెప్పాలి. ఆ సినిమా రిలీజ్ అయ్యి 70 ఏళ్లు కంప్లీట్ అవుతున్నా.. క్రేజ్ మాత్రం చెక్కుచెదరలేదు. ముఖ్యంగా ఆ సినిమా అంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది.. ఆహా నా పెళ్లంట సాంగ్.. అంతలా ఆ పాట మెప్పించింది. సావిత్రి అయితే ఓ రేంజ్ లో ఆకట్టుకున్నారు.

ఆ పాట సందర్భాన్ని బట్టి సావిత్రి తన హావభావాలతో అందరినీ ఫిదా చేశారు. అలా ఆహా నా పెళ్లంట సాంగ్.. ఓ ఐకానిక్ అని చెప్పాలి. అలాంటి పాటను రీసెంట్ గా ఓ డ్యాన్స్ షోలో ఖూనీ చేశారని చెప్పాలి. బెల్లీ డ్యాన్స్.. పొట్టి డ్రెస్.. ఎక్స్పోజింగ్.. అలా సాంగ్ ను చెడగొట్టేశారని అంతా విమర్శిస్తున్నారు. థీమ్ ఓకే అయినా ఇది కరెక్ట్ కాదని అంటున్నారు.

అదే సమయంలో ఆ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ జరిగిన ఎపిసోడ్ కు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ గెస్ట్ గా వెళ్లారు. ఆ ఖూనీ చేసిన పెర్ఫార్మెన్స్ బాగుందని తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై అనేక విమర్శలు వచ్చాయి. గెస్ట్ గా వెళ్లి అలా ఖూనీ చేస్తే.. క్వశ్చన్ చేయకుండా తిరిగి అలా రెస్పాండ్ అయ్యారేంటని అంతా కామెంట్లు పెట్టారు.

ఇప్పుడు ఆ విషయంపై సారంగపాణి జాతకం మూవీ ఈవెంట్ లో మోహన్ కృష్ణ రెస్పాండ్ అయ్యారు. నార్మల్ గా డ్యాన్స్ షోలకు గెస్టులుగా వెళ్తామని తెలిపారు. అలాంటి సమయాల్లో అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉండదని చెప్పారు. ఆ డ్యాన్సర్ కష్టపడి పెర్ఫామ్ చేసినట్లు అన్నారు. అందుకే ఎంతో కొంత అభినందించాల్సిందేనని తెలిపారు.

అయితే ఏదైనా షోకు వెళ్లినప్పుడు.. నార్మల్ గా నవ్విన దాన్ని.. కట్స్ చేస్తారని, వాటిని ఇంకో దగ్గర యాడ్ చేస్తారని పేర్కొన్నారు. తాను ఆ ఎపిసోడ్ లో ఓసారి నవ్వా.. అందుకే ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నానని తెలిపారు. ఇప్పుడు అలా క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని చెప్పారు. షోలకు వెళ్లినప్పుడు విమర్శించకూడదని మోహన్ కృష్ణ అన్నారు.

అదే సమయంలో తనకు బెల్లీ డ్యాన్స్ అంటే ఇష్టమని మోహన్ కృష్ణ తెలిపారు. కానీ ఆహా నా పెళ్లంట సాంగ్ కు బెల్లీ డ్యాన్స్ సెట్ కాదనిపించిందని చెప్పారు. అయినా ఏమైనా కూడా అక్కడ డిస్కస్ చేయలేమని వెల్లడించారు. అలా ఇప్పుడు ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..