మోహన్‌బాబు కోపం ఇలా తగ్గించుకున్నారట..!
టాలీవుడ్ సీనియర్ స్టార్స్‌లో మోహన్ బాబు ఒకరు. ఆయన ఒకప్పుడు చేసిన సినిమాల్లో చాలా వరకు సూపర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి.
By: Tupaki Desk | 22 July 2025 12:42 PM ISTటాలీవుడ్ సీనియర్ స్టార్స్‌లో మోహన్ బాబు ఒకరు. ఆయన ఒకప్పుడు చేసిన సినిమాల్లో చాలా వరకు సూపర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. నటుడిగా ఎన్నో గొప్ప పాత్రలు చేసిన మోహన్ బాబు హీరోగానే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ మెప్పించిన విషయం తెల్సిందే. అయితే ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తూ వచ్చాయి. అంతే కాకుండా ఆయన చివరగా ప్రధాన పాత్రలో నటించిన సన్నాప్ ఇండియా తీవ్రంగా విమర్శలను ఎదుర్కొంది. సినిమాకు నెగటివ్ టాక్ రావడం సరే కానీ, మరీ దారుణంగా ట్రోల్స్ చేశారు. ఒక సీనియర్ నటుడి సినిమాను ఆ స్థాయిలో ట్రోల్ చేయడం బాధ కలిగించింది అంటూ చాలా మంది ఆయన ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
మోహన్ బాబు ఇటీవల కన్నప్ప సినిమాలో అత్యంత విశిష్టత కలిగిన వాయు లింగంను కాపాడే మహాదేవ శాస్త్రి పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. కనిపించింది కొన్ని నిమిషాలే అయినా ఆకట్టుకున్నాడు. అత్యంత పవర్ ఫుల్ పాత్ర అది, దాన్ని సమర్ధవంతంగా పోషించాడు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత చిత్రాలతో పోల్చితే కన్నప్ప సినిమాకు అంత నెగిటివిటీ స్ప్రెడ్ కాలేదు. దాంతో సినిమా వసూళ్ల పరంగా పర్వాలేదు అనిపించుకుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధించిన వసూళ్లు సంతృప్తికరంగానే ఉన్నాయని సమాచారం. తాజాగా మోహన్ బాబు ఒక జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆ ఇంటర్వ్యూలో రజనీకాంత్‌తో తనకు ఉన్న స్నేహం గురించి చెప్పుకొచ్చాడు. తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తమిళ ప్రేక్షకులకు సైతం మోహన్ బాబు, రజనీకాంత్ మధ్య ఉన్న స్నేహం గురించి తెలుసు. ప్రతి ఒక్కరూ వీరిద్దరి స్నేహం గురించి ఏదో ఒక సమయంలో తెలుసుకుని ఉంటారు. మోహన్ బాబు చెన్నై వెళ్తే ఖచ్చితంగా రజనీకాంత్‌ను కలుస్తాడని అంటారు, అలాగే ఆయన హైదరాబాద్ వస్తే మోహన్ బాబును కలవడం పరిపాటిగా వస్తుంది. ఇద్దరికీ అంతటి స్నేహం ఉంది. తాను రజనీకాంత్ ను హేమ్ బ్లడీ తలైవా అని పిలుచుకుంటాను. అతడు నేను ఎలా పిలిచినా అప్యాయంగా పలుకుతాడు, మా మధ్య అంతటి చనువు, సాన్నిహిత్యం ఉందని మోహన్ బాబు అన్నారు.
నాకు మొదటి నుంచి కోపం కాస్త ఎక్కువే ఉండేది. ఆ కోపం తగ్గించుకోవడానికి బుక్స్ చదవమని చెబుతూ ఉండేవాడు. అయితే బుక్స్ చదవడం మాత్రమే కాకుండా దానిలో ఉన్న సారాంశం ను అర్థం చేసుకుని, జీవితానికి అన్వయించుకునేందుకు ప్రయత్నం చేయి అనేవాడు, అందుకే ఆయన చెప్పినట్లు చేయడం వల్ల గతంలో పోల్చితే చాలా వరకు కోపం తగ్గిందని మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. నిజంగానే గతంలో మోహన్ బాబు పదే పదే కోపం తెచ్చుకుని, నటీనటులను, సాంకేతిక నిపుణులు తిట్టడం, కొట్టడం వంటివి చేసే వారని వార్తలు వస్తూ ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో మోహన్ బాబు యొక్క కోపం గురించి ఎప్పుడూ ఏ కంప్లైంట్ రాలేదు. గతంలో ఆయన కోపం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉన్నాం. కేవలం రజనీకాంత్ చెప్పిన సలహా కారనంగానే మోహన్ బాబు కోపం పోయిందట.
