Begin typing your search above and press return to search.

నాకు నా కన్నతల్లే కన్నప్ప : మోహన్ బాబు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   5 Jun 2025 8:43 PM IST
నాకు నా కన్నతల్లే కన్నప్ప : మోహన్ బాబు
X

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. మై కన్నప్ప స్టోరీ అంటూ ఒక వీడియో చేశారు. అందులో కన్నప్ప చరిత్రని ప్రస్తావిస్తూ తన జీవితంలో కన్నప్ప అంటే తన తల్లే అని అన్నారు. అమాయకుడు. ఆటవికుడైన తిన్నడు.. పరమేశ్వరుడికి తన కళ్లు ఇచ్చి కన్నప్పగా చరిత్రలో మిగిలిపోయాడు. అలానే మన ఆకలి తెలుసుకుని అడగకుండానే అమ్మ అన్నం పెడుతుంది. మనకి ఏది కావాలంటే దానిని వారి శక్తి మించి అమ్మానాన్నలు ఇస్తారు. నా దృష్టిలో మా అమ్మానాన్నలే కన్నప్ప అన్నారు మోహన్ బాబు.

మా అమ్మ పేరు లక్షమ్మ.. దురదృష్టవశాత్తు ఆమెకు పుట్టుకతోనే రెండు చెవులు వినిపించేవి కాదు. ఆమెకు ఐదుగురు సంతానాన్ని దేవుడు ప్రసాదించాడు. టౌన్ నుంచి ఊరు వెళ్లాలంటే 7 కిలోమీటర్లు నడవాలి. ఆ దాని కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఒక కాలువ, సువర్ణముఖి నదిని దాటాలి.. మమ్మల్ని అందరినీ మోసుకుంటూ అమ్మ ఆ దారిలో ప్రయాణించేది.. అది ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి.. ఈ విషయాలు ఇప్పుడు తలచుకుంటే భావోద్వేగంగా ఉందని అన్నారు మోహన్ బాబు.

అంతేకాదు అందరు నా కంఠాన్ని మెచ్చుకుంటున్నప్పుడు ఈ మాటలు నా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది పరమేశ్వరా అని బాధపడేవాడినని అన్నారు. నా జీవితంలో నా కన్నతల్లే కన్నప్ప అని మోహన్ బాబు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన కన్నప్ప సినిమాలో మంచు విష్ణు లీడ్ రోల్ లో నటించారు. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ నటించారు.

జూన్ 27న రిలీజ్ అవుతున్న సందర్భంగా కన్నప్ప ప్రమోషన్స్ జోరు పెంచారు. త్వరలో సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా మై కన్నప్ప స్టోరీ అంటూ ఒక వెరైటీ ప్రమోషనల్ కంటెంట్ అందిస్తున్నారు చిత్ర యూనిట్.

కన్నప్ప నుంచి వచ్చిన సాంగ్స్ ఇంప్రెస్ చేయగా రీసెంట్ గా వదిలిన టీజర్ కూడా ఆకట్టుకుంది. కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో నటించాడు. సినిమాలో ప్రభాస్ రోల్ ఎలా ఉండబోతుంది అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఉన్నారు. ప్రభాస్ రోల్ అదరగొట్టేస్తే మాత్రం రెబల్ ఫ్యాన్స్ కన్నప్పని తమ భుజాల మీద వేసుకుని సక్సెస్ చేస్తారని చెప్పొచ్చు.

https://x.com/themohanbabu/status/1930573344031617223 https://x.com/themohanbabu/status/1930573344031617223