Begin typing your search above and press return to search.

'రేపటి గురించి ఆలోచించను.. దటీజ్ రామన్న'.. మోహన్ బాబు అదుర్స్!

ఆయన డైలాగ్స్ చెబుతుంటే.. ఒక్కసారిగా చప్పట్ల మోత మోగింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   9 Jun 2025 11:06 PM IST
రేపటి గురించి ఆలోచించను.. దటీజ్ రామన్న.. మోహన్ బాబు అదుర్స్!
X

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇప్పటికే ఎన్నో విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. తన కెరీర్ లో వివిధ అద్భుతమైన పాత్రలు పోషించి మెప్పించారు. అందులో ఒకటి రాయలసీమ రామన్న చౌదరి. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఆ మూవీ రిలీజై 51 ఏళ్లు అవుతుంది.

ఆ సినిమాలో మోహన్ బాబు యాక్టింగ్ వేరే లెవెల్. శ్వాగ్ అయితే కంప్లీట్ స్పెషల్ గా ఉంటుంది. డ్యూయల్ రోల్ లో కనిపించిన మోహన్ బాబు.. ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆ మూవీ గురించి ఎందుకు అనుకుంటున్నారా? రీసెంట్ గా కన్నప్ప ఈవెంట్ లో ఆయన రాయలసీమ రామన్న చౌదరి డైలాగ్స్ చెప్పారు.

మంచు విష్ణు లీడ్ రోల్ లో నటించిన కన్నప్ప మూవీని మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆయన కీలక పాత్రలో నటించారు కూడా. నిన్న గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అద్భుతమైన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఆ సమయంలో రాయలసీమ రామన్న చౌదరి సినిమాలోని తన డైలాగ్స్ చెప్పి ఒక్కసారిగా హోరెత్తించారు.

ఆయన డైలాగ్స్ చెబుతుంటే.. ఒక్కసారిగా చప్పట్ల మోత మోగింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నో ఛేంజ్.. సేమ్ శ్వాగ్.. డైలాగ్ లో సేమ్ పవర్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కలెక్షన్ కింగ్ ఎవర్ గ్రీన్ నటుడు అంటూ మోహన్ బాబును కొనియాడుతున్నారు.

"బలవంతుడు ఎదురు వచ్చినప్పుడు తలదించు వాడు బాగుపడతాడు.. ఎదిరించిన వాడు వాగులో పడతాడు.. ఇది రాయల సీమ రామన్న.. నిన్న జరిగింది మర్చిపోను.. నేడు జరగాల్సింది వాయిదా వేయను.. రేపటి గురించి ఆలోచించను.. దటీజ్ రామన్న" అంటూ మోహన్ బాబు డైలాగ్స్ చెబుతుంటే ఈలలే ఈలలు.

అయితే కన్నప్పలో మహాదేవ శాస్త్రిగా కీలక పాత్ర పోషించారు మోహన్ బాబు. ఇప్పటికే ఆయన లుక్ ను మేకర్స్ రివీల్ చేశారు. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అదే సమయంలో జూన్ 27వ తేదీన వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్ లో కన్నప్ప మూవీ రిలీజ్ కానుంది. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో అంతా వేచి చూడాలి.