Begin typing your search above and press return to search.

రాజమౌళి గురించి మోడీ కామెంట్స్..!

వేవ్స్ ఇండియా సమ్మిట్ లో పీఎం నరేంద్ర మోడీ ఇండియన్ సినిమా దర్శకుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

By:  Tupaki Desk   |   2 May 2025 4:34 PM IST
రాజమౌళి గురించి మోడీ కామెంట్స్..!
X

వేవ్స్ ఇండియా సమ్మిట్ లో పీఎం నరేంద్ర మోడీ ఇండియన్ సినిమా దర్శకుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వేవ్స్ సమ్మిట్ లో భారతదేశ దిగ్గజ నటులంతా కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి మోడీ రాజమౌళితో పాటు మన భారతీయ దర్శకుల ప్రస్తావన తెచ్చారు. వారు తీస్తున్న సినిమాల వల్ల ప్రపంచ దేశాలకు మన సంస్కృతి తెలుస్తుందని అన్నారు. ముఖ్యంగా ఇందుకు కారణమైన రాజమౌళి ఇంకా ఇతర దర్శకులు అంటూ చెప్పారు మోడీ.

రాజమౌళి తీసిన RRR సినిమా గురించి మోడీ చెప్పారు. భారతీయ సినిమాలు వరల్డ్ ఆడియన్స్ ని ఎలా ఆకర్షిస్తున్నాయో చెప్పారు. ఆర్.ఆర్.ఆర్ ఇతర భారతీయ సినిమాలు ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయని అన్నారు మోడీ. ఈ క్రమంలోనే రాజమౌళి సాధించిన విజయాల గురించి చెబుతూ ప్రశంసలు అందించారు. మోడీ స్పీచ్ లో భారతీయ సినిమా విస్తరిస్తున్న విధానాన్ని గురించి చర్చించారు.

ఇక మోడీ స్పీచ్ లో సినిమా వల్ల సాస్కృతిక అందరికీ తెలుస్తుంది. భారతీయ సంస్కృతి ప్రపంపంచానికి పరిచయం చేస్తున్నందుకు రాజమౌళి ఇంకా ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు నరేంద్ర మోడీ. శతాబ్దంలో భారతీయ సినిమా కథలను వరల్డ్ వైడ్ గా వ్యాప్తి చేయడంలో విజయం సాధిస్తున్నారని అన్నారు. రష్యాలో రాజ్ కపూర్ కి, కేన్స్ లో సత్యజిత్ రే కి ప్రశంసలు వచ్చాయి. ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ సాధించడం ద్వారా కూడా వరల్డ్ సినీ లవర్స్ మన సినిమాలు ఎంతగా ఆదరిస్తున్నారో నిరూపించబడింది అన్నారు.

రాజమౌళి సాధిస్తున్న విజయాల గురించి ప్రధాని మోడీ చెప్పడం ప్రత్యేకంగా నిలిచింది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శక ధీరుడు రాజమౌళి ఆయన ప్రతి సినిమాతో టాలీవుడ్ రేంజ్ పెంచుతూ వచ్చారు. ఆర్.ఆర్.ఆర్ లోని నాటు నాటు సాంగ్ తో ఆస్కార్ అందుకునేలా చేశారు. ఐతే ఈసారి మహేష్ సినిమాతో సినిమాకు కనీసం మరో రెండు అకాడమీ అవార్డులు వచ్చేలా చేయాలని చూస్తున్నాడు జక్కన్న. వేవ్స్ సమ్మిట్ లో రాజమౌళి తో పాటు మన టాలీవుడ్ దిగ్గజాలు కూడా పాల్గొన్నారు. చిరంజీవి కూడా తను కూడా అప్పటికే స్టార్స్ గా ఉన్న వారి స్పూర్తి పొందే సినిమాల్లోకి వచ్చానని.. కమల్ నుంచి డ్యాన్స్ లు స్పూర్తి పొందానని చెప్పారు. ఇదే సమ్మిట్ లో అక్షయ్ కుమార్ కూడా చిరంజీవి అంటే డ్యాన్స్, ఫైట్స్ గుర్తొస్తాయని చెప్పారు.