Begin typing your search above and press return to search.

అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సీక్వెల్.. ట్విస్ట్ ఏంటంటే..?

మాస్ మహరాజ్ రవితేజ నటించిన సూపర్ హిట్ మూవీ అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   29 Nov 2023 4:30 AM GMT
అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సీక్వెల్.. ట్విస్ట్ ఏంటంటే..?
X

మాస్ మహరాజ్ రవితేజ నటించిన సూపర్ హిట్ మూవీ అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన విషయం తెలిసిందే. 2003లో వచ్చిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ ని మెప్పించింది. బాక్సింగ్ నేపథ్యంతో పాటుగా మదర్ సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్నారట మేకర్స్. అదేంటి పూరీ ఇస్మార్ట్ డబుల్ తో.. రవితేజ తన నెక్స్ట్ సినిమాతో బిజీగా ఉన్నారు కదా అసలు అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సీక్వెల్ డిస్కషన్స్ లో కూడా లేదు కదా అనుకోవచ్చు.

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సీక్వెల్ ఉంటుంది. కానీ అది తెలుగులో కాదు తమిళంలో అని తెలుస్తుంది. పూరీ తీసిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా తమిళ్ లో ఎం కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి గా రీమేక్ చేశారు. జయం రవి, ఆసిన్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేశారు. రీమేక్ స్పెషలిస్ట్ అయిన మోహన్ రాజా తీసిన ఎం కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి కూడా సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో జయసుధ చేసిన మదర్ రోల్ తమిళంలో నదియా చేశారు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నదియా చేసిన సినిమా అది.

ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్నారు మోహన్ రాజా. లాస్ట్ ఇయర్ చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమా చేసిన మోహన్ రాజా నాగార్జున, అఖిల్ తో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేశారు. ఏమైందో ఏమో కానీ ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఆ తర్వాత మోహన్ రాజా ఎం కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి సీక్వెల్ ప్లాన్ చేశారు. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

జయం రవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. జయం రవి మోహన్ రాజా ఈ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అన్న డైరెక్టర్ తమ్ముడు హీరోగా పర్ఫెక్ట్ సింక్ తో సినిమాలు చేస్తారు. ఆడియన్స్ కూడా ఈ కాంబో సినిమా అనగానే భారీ అంచనాలతో ఉంటారు. మరి ఎం కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి 2 ఎలా ఉంటుందో చూడాలి.