Begin typing your search above and press return to search.

ఆహా బోల్డ్ మూవీ.. కాస్త ఘాటు ఎక్కువే!

ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న మిక్స్ అప్ మూవీలో ఆదర్శ్ బాలకృష్ణ, అక్షరా గౌడ, కమల్ కామరాజు, పూజా జావేరి లీడ్ రోల్స్ పోషించారు.

By:  Tupaki Desk   |   16 March 2024 7:27 AM GMT
ఆహా బోల్డ్ మూవీ.. కాస్త ఘాటు ఎక్కువే!
X

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో ప్రతి వారం రకరకాల కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఎలాంటి సెన్సార్ రూల్స్ లేకపోవడంతో బోల్డ్ సబ్జెక్టుతో ఉన్న కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోకి రిలీజ్ అవుతున్నాయి. తాజాగా మిక్స్ అప్ చిత్రం.. థియేటర్లోకి రాకుండానే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ లో స్ట్రీమింగ్‍ కు వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న మిక్స్ అప్ మూవీలో ఆదర్శ్ బాలకృష్ణ, అక్షరా గౌడ, కమల్ కామరాజు, పూజా జావేరి లీడ్ రోల్స్ పోషించారు. రెండు జంటల రిలేషన్‍ కు సంబంధించిన కథతో ఈ సినిమా రూపొందింది. తమ శృ*గార జీవితం గురించి చెప్పే ట్రైలర్‌ తో ఈ బోల్డ్ కంటెంట్ సినిమాపై రిలీజ్ కు ముందే ఆసక్తి నెలకొంది. ఇప్పుడు మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది.

కామంపై ప్రేమ గెలుస్తుందా? అంటూ మిక్స్ అప్ మూవీపై ఆహా చేసిన ప్రమోషన్స్.. కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. స్ట్రీమ్ అయిన తర్వాత ఆహా.. గ్లింప్స్ విడుదల చేసింది. అందులో కూడా బోల్డ్ కంటెంట్ బాగానే ఉంది. సినిమాపై ఆసక్తి కలిగిస్తోంది. ఈ మూవీకి ఆకాశ్ బిక్కీ దర్శకత్వం వహించగా.. తిరుమల్ రెడ్డి అమిరెడ్డి నిర్మించారు. కౌశిక్ బాణీలు కట్టగా.. హైమా వర్షిణి కథ అందించారు. ఆదర్శ్ – అక్షర, కమల్ కామరాజ్– పూజ.. ఈ చిత్రంలో కపుల్స్ గా నటించారు.

మిక్స్ అప్ స్టోరీ ఇదే..

అభయ్ (కమల్ కామరాజు)-నిక్కీ (అక్షరా గౌడ)తోపాటు సాహు (ఆదర్శ్ బాలకృష్ణ)- మైథిలీ (పూజా జావేరి) భార్యాభర్తలు. కానీ వారికి సె*క్స్ పరంగా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఈ రెండు కపుల్స్.. విడివిడిగా ఓ సైకాలిజిస్ట్ ను కలుస్తారు. ఆ సమయంలో సైకాలిజిస్ట్ తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెబుతుంది. ఏదైనా టూర్ ప్లాన్ చేసుకోమని చెప్పగా.. గోవా వెళ్తాయి రెండు జంటలు.

అయితే గోవా వెళ్లి తర్వాత రెండు జంటల మధ్య ఏం జరిగింది? అసలు వారి ఇబ్బందులకు కారణమేంటి? గోవా వెళ్లడానికి ఇంకో కారణమేంటి? అక్కడ జరిగిన పలు జరిగిన ఘటనలకు రీజన్ ఏంటి? లాస్ట్ కు ఆ రెండు జంటల పరిస్థితి ఏమైంది? అన్ని సమస్యలు క్లియర్ అయ్యాయా? వంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే వెంటనే మిక్స్ అప్ సినిమా చూడాల్సిందే.