ముసుగులు తీసేశారు.. బన్నీ వాస్ 'మిత్రమండలి' ఇదే!
ముఖ్యంగా ముసుగులు వేసుకున్న యాక్టర్స్ ఎవరో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు మేకర్స్.. ఆ ముసుగులు వేసుకున్నదెవరో రివీల్ చేశారు.
By: Tupaki Desk | 6 Jun 2025 12:41 PM ISTటాలీవుడ్ ప్యాషనేటెడ్ నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాస్.. తన సొంత బ్యానర్ బీవీ వర్క్స్ పై ఫస్ట్ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి ఆయన నిర్మిస్తున్న మూవీ ప్రీ లుక్ పోస్ట్ రీసెంట్ గా రిలీజైంది. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుని సందడి చేసింది.
ముఖ్యంగా ముసుగులు వేసుకున్న యాక్టర్స్ ఎవరో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు మేకర్స్.. ఆ ముసుగులు వేసుకున్నదెవరో రివీల్ చేశారు. సినిమా టైటిల్ ను ప్రకటించారు. ప్రస్తుతం మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూవీపై అప్పుడే మంచి బజ్ కూడా క్రియేట్ చేసింది.
సినిమాకు మిత్రమండలి అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి. పోస్టర్ లో ముసుగు వేసిన గ్యాంగ్ ను మేకర్స్ పరిచయం చేశారు. తద్వారా ప్రియదర్శి , రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా లీడ్ రోల్స్ పోషిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా స్టార్ నిహారిక కూడా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు.
అయితే ఇప్పటికే ప్రియదర్శి తన యాక్టింగ్ తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మ్యాడ్ ఫేమ్ విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా టాలెంట్ గురించి తెలిసిందే. నిహారిక.. సోషల్ మీడియా ద్వారా సూపర్ ఫేమ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వారంతా మిత్రమండలి మూవీతో ఫుల్ ఫన్ అందిస్తారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
బన్నీ వాస్ సమర్పిస్తున్న మిత్రమండలి మూవీని కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. సోమరాజు పెన్మెత్స సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరితోపాటు అద్భుతమైన సాంకేతిక నిపుణులను కూడా రంగంలోకి దించారు మేకర్స్.
ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా సిద్ధార్థ్ ఎస్.జె వర్క్ చేస్తున్నారు. ఎడిటర్ గా పీకే, ఆర్ట్ డైరెక్టర్ గా గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్ డిజైనర్ గా శిల్పా టంగుటూరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రాజీవ్ కుమార్ రామా వర్క్ చేస్తున్నారు. స్నేహం ప్రధానంగా నడిచే కథతో సినిమా రూపొందుతోంది. త్వరలో మరిన్ని అప్డేట్స్ కూడా ఇవ్వనున్నారు మేకర్స్.
