ఒక్క మూవీ.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కు రూ.25 కోట్లా? నమ్మొచ్చా?
మ్యూజిక్ డైరెక్టర్ ఏ సినిమాకు అయినా అవసరమే. ఎందుకంటే సాంగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి మూవీలో కీలక పాత్ర పోషిస్తాయి.
By: Tupaki Desk | 31 May 2025 11:57 AM ISTమ్యూజిక్ డైరెక్టర్ ఏ సినిమాకు అయినా అవసరమే. ఎందుకంటే సాంగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి మూవీలో కీలక పాత్ర పోషిస్తాయి. రిలీజ్ కు బజ్ క్రియేట్ చేయడంలో పాటలదే ముఖ్యపాత్ర. ప్రజల నోటిలో సాంగ్స్ నానితే.. భారీ హైప్ క్రియేట్ అయినట్లే. దీంతో ప్రతీ సినిమా మేకర్స్ కూడా.. మ్యూజిక్ విషయంలో ఇంట్రెస్ట్ ఎక్కువే పెడతారు.
అదే సమయంలో నటీనటులు, దర్శకుడు, తర్వాత సంగీత దర్శకులకే ఎక్కువ రెమ్యునరేషన్ అందుతుంటుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంటోంది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్.. చాలా కాలం పాటు అత్యధిక పారితోషికాన్ని అందుకున్న సంగీత దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో కొనసాగారు.
ఆయన ఒక్క మూవీకి దాదాపు రూ.10 కోట్ల ప్యాకేజీ తీసుకుంటారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత మరో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పెద్ద మొత్తంలో తీసుకుంటారని టాక్ వచ్చినా.. ఇప్పటి వరకు ఆయన రెమ్యునరేషన్ ఎక్కడా ఎప్పుడూ రివీల్ అవ్వలేదు. కాబట్టి క్లారిటీగా తెలియరాలేదు.
ఇక యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. ఒక్కో సినిమాకు రూ.10-15 కోట్లు వసూలు చేస్తున్నారని సమాచారం. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కూడా.. పెద్ద ఎత్తున అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్క సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వసూలు చేస్తారని టాక్.
అయితే ఇండస్ట్రీలో వీళ్లంతా సాలిడ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. నేషనల్ వైడ్ గా బ్రాండ్ వాల్యూ కూడా సొంతం చేసుకున్నారు. అదే సమయంలో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మిథూన్.. రూ.25 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నారని, అందరినీ డామినేట్ చేశారని ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా బాలీవుడ్ లోనే ఆ విషయం ఎక్కువగా వైరల్ అవుతోంది. కానీ ఇప్పటి వరకు ఆయనకు అంతగా ఫేమ్ లేదు. ఆయన మూవీల్లో గదర్ 2 ఒకటే కాస్త పాపులర్ అయింది. ఆ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఏం హిట్ కాలేదు. దీంతో ఆయనకు రూ.25 కోట్ల రెమ్యునరేషన్ అన్న వార్త పీఆర్ స్టంటేనని అంతా అంటున్నారు. బ్రాండ్ వాల్యూ ఉన్నా అంత మొత్తంలో ఎవరు చెల్లించరని అంటున్నారు. అసలు నమ్మలేమని చెబుతున్నారు.
