విశ్వక్ సేన్ హీరోయిన్ బోల్డ్ సీన్.. లిప్ లాక్ తో ఇంటర్నెట్ షేక్!
కర్లీ హెయిర్ క్యూట్ బ్యూటీ మిథిలా పాల్కర్ ఓరి దేవుడా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
By: Tupaki Desk | 14 July 2025 10:36 PM ISTకర్లీ హెయిర్ క్యూట్ బ్యూటీ మిథిలా పాల్కర్ ఓరి దేవుడా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతోనే కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టేసింది. ఇక తాజాగా మిథిలా ఓహో ఎంతన్ బేబీ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం జూలై 11న రిలీజైంది. అయితే ఈ సినిమాకు అనుకున్నంత స్పందన రాలేదు.
కానీ ఇందులో మిథిల లిప్ లాక్ సీన్ లో నటించింది. ఆ కిస్ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మిథిల ఈ సినిమాలో మీరా పాత్రలో కనిపించింది. ఇందులో హీరో అశ్విన్- మీర మధ్య బ్రేకప్ సన్నివేశం ఉంది. ఆ సమయంలో అశ్విన్ కంట్రోల్ తప్పి మీరను లిప్ లాక్ చేస్తాడు. ఈ సీన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
అయితే ఈమె గతంలో తెలుగు, హిందీ సినిమాల్లో నటించినప్పకీ ఇలా బోల్డ్ సీన్స్లో కనిపించే దైర్యం చేయలేదు. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాల్లో ఇంటిమేషన్ సీన్స్, బోల్డ్ సన్నివేశాలు లేవు. కానీ మిథిల ఈ సినిమా కోసం హద్దులు చెరిపేసి కిస్ సీన్ లో నటించడంతో ఆభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆమెలోని ఈ కొత్త కోణం చూసి షాక్ అవుతున్నారు.
అందుకే ఈ లిప్ లాక్ క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే ఈ లిప్ లాక్ కేవలం ఒక చిన్న ముద్దు సన్నివేశమే కాదు.ఈ సీన్ స్టోరీలో ఓ టర్నింగ్ పాయింట్. ఏది ఏమైనప్పటికీ ముద్దు సీన్ ను చూసి కొంతమంది ఆశ్చర్యపోతే, మరి కొందరు మూవీ లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
కాగా, ఈ సినిమాలో రుద్ర, విష్ణు విశాల్, అంజు కురియన్, మిస్కిన్, రెడిన్ కింగ్స్ లే తదితరులు ఆయా పాత్రల్లో కనిపించారు. కృష్ణకుమార్ రామకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది ఓ యంగ్ ఫిల్మ్ మేకర్ హార్ట్ బ్రేక్ నేపథ్యంలో ఈ సినిమా తెరెక్కింది.
ఇక మిథిలా పాల్కర్ సినిమాల విషయానికొస్తే, ఆమె త్రిబాంగ్, చోప్ స్టిక్స్, కార్వాన్ లాంటి తదితర చిత్రాల్లో నటించింది. అటు సోషల్ మీడియా సూపర్ యాక్టీవ్ గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఈ అమ్మడుకు దాదాపు 4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇందులో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ షేర్ చేస్తుంటుంది.
