Begin typing your search above and press return to search.

వైరల్‌ పిక్‌ : మిస్‌ యూనివర్స్‌ స్టేజ్‌ పై మన బ్యూటీ

అంతర్జాతీయ వేదికలపై మన అమ్మాయిలు అంతగా రాణించని ఈ రోజుల్లో శ్వేత ఫుల్‌ స్వింగ్‌ లో దూసుకు పోతుంది.

By:  Tupaki Desk   |   17 Nov 2023 4:11 PM GMT
వైరల్‌ పిక్‌ : మిస్‌ యూనివర్స్‌ స్టేజ్‌ పై మన బ్యూటీ
X

హాలీవుడ్‌ ముద్దుగుమ్మలు మాత్రమే హాట్ గా ఉంటారు, వారు మాత్రమే అందాల ఆరబోత చేస్తారు అనే స్టేజ్ నుంచి బాలీవుడ్‌ మరియు సౌత్ ఇండియన్‌ సినీ తారలు కూడా అందాల ఆరబోత విషయంలో ముందు ఉంటారు అనే వరకు పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో అందాల విందుతో మన శ్వేత శారదా కన్నుల విందు చేస్తుంది.


అంతర్జాతీయ వేదికలపై మన అమ్మాయిలు అంతగా రాణించని ఈ రోజుల్లో శ్వేత ఫుల్‌ స్వింగ్‌ లో దూసుకు పోతుంది. ఏకంగా మిస్ యూనివర్స్‌ పోటీల్లో టాప్‌ లోకి దూసుకు వచ్చింది. స్విమ్‌ సూట్‌ రౌండ్‌ లో శ్వేత తన అందంతో జడ్జ్‌ లతో పాటు అందరిని కూడా అలరించింది.

72వ మిస్‌ యూనివర్స్ పోటీల్లో భారత్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న శ్వేత శారద కచ్చితంగా విజేతగా నిలుస్తుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు పెద్దగా సౌండ్‌ లేని శ్వేత ఇప్పుడు చాలా వైరల్‌ అవుతోంది అంటూ ఆమె ఫాలోవర్స్ అంటున్నారు.

ఇలాంటి పోటీల్లో రన్నర్‌ గా నిలిచినా కూడా బాలీవుడ్‌ తో పాటు అన్ని సౌత్‌ ఇండియన్ సినీ భాషలకు చెందిన నిర్మాతలు మరియు దర్శకులు ఆఫర్లు ఇచ్చేందుకు క్యూ కడతారు. ఇప్పుడు శ్వేత శారద ను స్విమ్‌ సూట్‌ లో చూసి చాలా మంది అప్పుడే ఆఫర్ తో రెడీ అయ్యి పోయి ఉంటారు.