Begin typing your search above and press return to search.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. టీమిండియా ప్లేయర్ ఏమన్నాడంటే..

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి

By:  Tupaki Desk   |   8 Nov 2023 12:09 PM GMT
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. టీమిండియా ప్లేయర్ ఏమన్నాడంటే..
X

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమా మహేష్ దర్శకత్వంలో తెరకెక్కింది. నవీన్ పొలిశెట్టి కామెడీ భాగా వర్క్ అవుట్ కావడంతో పాటు అందరికి కనెక్ట్ అయ్యింది.

అలాగే మూవీలో టచ్ చేసిన పాయింట్ కూడా కొత్తగా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమాని చూడటానికి ఆసక్తి చూపించారు. తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా డబ్బింగ్ వెర్షన్ గా ఈ మూవీ ఒటీటీలో రిలీజ్ అయ్యింది. ప్లెజెంట్ కామెడీ, ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లేతో నడిచిన ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఇండియన్ క్రికెటర్ దినేష్ కార్తిక్ ఇంటరెస్టింగ్ కామెంట్స్. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ లాంటి సినిమా గురించి ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న లైట్ హార్టెడ్ కామెడీతో ఈ సినిమా చాలా అద్భుతంగా అనిపించింది. నవీన్ పొలిశెట్టి అద్భుతమైన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. మరోసారి మంచి స్క్రిప్ట్ తీసుకొని తనదైన కామెడీతో నవ్వించాడు. ఇంప్రెస్ చేశాడు అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. దినేష్ కార్తిక్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాపై చేసిన పోస్ట్ పై నెటిజన్లు కూడా ఇంటరెస్టింగ్ గా స్పందిస్తున్నారు. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ తో ఎలాంటి కథకి అయిన జీవం పోస్తాడని అతని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు నవీన్ పొలిశెట్టి నుంచి ఎలాంటి కథలు మరిన్ని ఆశించవచ్చని పోస్టులు పెడుస్తున్నారు.

థియేటర్స్ లో అందరిని ఎంటర్టైన్ చేసిన ఈ సినిమా ఒటీటీలో కూడా రికార్డ్ స్థాయి వ్యూస్ తో దూసుకుపోతోంది. టాప్ మూవీస్ లో ఇది కూడా ఒకటిగా ఉంది. అన్ని భాషలలో ప్రేక్షకులని అలరిస్తూ ఉండటం విశేషం. నవీన్ పొలిశెట్టి నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా వస్తుందా అనేది ఇప్పుడు అతని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.