Begin typing your search above and press return to search.

అనుష్క హగ్ పై నవీన్ క్రేజీ కామెంట్స్..!

యువ హీరో నవీన్ పొలిశెట్టి అనుష్క లీడ్ రోల్స్ లో మహేష్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి

By:  Tupaki Desk   |   23 Aug 2023 6:15 AM GMT
అనుష్క హగ్ పై నవీన్ క్రేజీ కామెంట్స్..!
X

యువ హీరో నవీన్ పొలిశెట్టి అనుష్క లీడ్ రోల్స్ లో మహేష్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. యువి క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచగా సినిమా ప్రమోషన్స్ లో నవీన్ బిజీ బిజీగా ఉన్నాడు. హీరోయిన్ అనుష్క ప్రమోషన్స్ కి దూరంగా ఉండటం ఆడియన్స్ ని కొంత నిరాశపరుస్తున్నా నవీన్ మాత్రం ఆ విషయాన్ని బాగా కవర్ చేస్తున్నాడు. త్వరలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఆ ఈవెంట్ కి అయినా అనుష్క వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

అయితే అనుష్క ప్రమోషన్స్ లో పాల్గొనకపోయినా ఆమెతో తన వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ షేర్ చేస్తున్నాడు నవీన్ పొలిశెట్టి. ఈ సినిమా టైం లో అనుష్క బాగా క్లోజ్ అయ్యిందని అన్నారు. అంతేకాదు సినిమాలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని నవీన్ అన్నారు. షూటింగ్ మొదలైన మొదటి రెండు రోజులు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత మాత్రం అనుష్క చాలా కంఫర్టబుల్ గా అనిపించిందని అన్నారు. షూటింగ్ అంతా కూడా చాలా సరదాగా సాగిపోయిందని అన్నారు.

అనుష్క నుంచి చాలా విషయాలను నేర్చుకున్నానని చెబుతున్నారు నవీన్ పొలిశెట్టి. అనుష్క నుంచి ముఖ్యంగా కౌగిలింతలు నేర్చుకున్నానని అన్నారు. సెట్స్ లోకి అడుగు పెట్టగానే అనుష్క హగ్ ఇస్తుందని ఆ హగ్ ఎంతో అభిమాన పూర్వకంగా ఉంటుందని అన్నారు. ఆవిడ నుంచి తాను కూడా అలా హగ్ ఇవ్వడం నేర్చుకున్నానని అన్నారు. అనుష్కకి ఉన్న మంచి క్వాలిటీస్ లో అదొకటని నవీన్ అన్నారు.

ట్రైలర్ లో అనుష్కని చాలా తక్కువ చూపించారని సినిమాలో ఆమె ఓ రేంజ్ లో ఉంటుందని అన్నారు నవీన్. సినిమా మొత్తం మా ఇద్దరి మీదే నడుస్తుందని కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవుతుందని నమ్మకంతో చెప్పారు. అనుష్క ఏ యాక్టర్ తో అయినా సింగ్ అయ్యే లక్షణం ఉందని అన్నారు. సెప్టెంబర్ 7న సినిమా అందరిని అలరిస్తుందని తప్పకుండా ప్రేక్షకులను సినిమా ఎంటర్టైన్ చేస్తుందని చెప్పుకొచ్చారు నవీన్ పొలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న నవీన్ పొలిశెట్టి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో కూడా తన హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. మరి అనుకున్న రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అన్నది సెప్టెంబర్ 7న తెలుస్తుంది.